పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు దేవుణ్ణిగూర్చి మనకు సంపూర్ణంగా తెలియజెప్పాడన్నాం. కాని ఆ తండ్రి మనకు చెప్పదల్చుకొన్న ముఖ్య విషయం ఏమిటి? తన రక్షణ సందేశమే. దీన్నే పౌలు “తండ్రి రహస్యప్రణాళిక” అని పిల్చాడన్నాం. ఈ రక్షణ ప్రణాళిక ప్రధానంగా క్రీస్తు మరణిజ్ఞానాలద్వారా నెరవేరుతుంది. కనుక క్రీస్తు మరణోత్తానాలతో తండ్రి రక్షణ ప్రణాళిక ముగుస్తుంది. అనగా దివ్యశ్రుతి క్రీస్తుతో అంతమౌతుందన్నమాట. ఈ దివ్యశృతినే తర్వాత అపోస్తలులు బోధించారు. దీన్నే తిరుసభకూడ జాగ్రత్తగా పదిలపరచి నేడు మనకు బోధిస్తుంది.

ప్రార్ధనా భావాలు

1. క్రీస్తు పట్టినప్పటినుండి చనిపోయి ఉత్తానమైనదాకాగూడ అతని బోధలూ చేతలూ అన్నీ తండ్రిని తెలియజేస్తూనే వుంటాయి, అతడు పితను ఎరుకపరచడమనేది నరావతారంతోనే ప్రారంభమౌతుంది. అతని జననమందు తండ్రి తన ప్రజలను సందర్శించాడు - లూకా 1,68. అతని పట్టకలో తండ్రి కృప మనకు ప్రత్యక్తమైంది -తీతు 2,11. బహిరంగ జీవితంలో క్రీస్తు అద్భుతాలు చేసినపుడల్లా తండ్రి అతనిలో పనిచేసూనే వున్నాడు - యోహా 10,87-88. క్రీసు తన మరణిత్తానాలద్వారా తండ్రిని మహిమపరుస్తాడు. తండ్రికూడ క్రీస్తుని మహిమపరుస్తాడు - యోహా 17,4. ఈ విధంగా క్రీస్తు జీవితమంతా, అతని మాటలూ చేతలూ అన్నీ తండ్రిని తెలియజేస్తాయి. ఈ దృష్టితోనే యోహాను అతన్ని జ్యోతి అని పేర్కొన్నాడు. అనగా అతని వెలుగులో మనం తండ్రిని చూస్తామని భావం - 8, 12. ఆ శ్రుతికర్తకు మనం భక్తితో నమస్కరించాలి.

2. క్రీస్తు మనకు శ్రుతిసాధనం. అనగా అతడు మనకు పితను తెలియజేసే మార్గం - యోహా 14.5-6. దేవుడే అతన్ని ఆ పనికి ఎన్నుకొన్నాడు. అతడువచ్చి ఆ దేవుడు తండ్రి కుమారుడు ఆత్మడు అనే మూడు రూపాల్లో వుంటాడని మనకు నేర్పాడు. మనం పాపులమనిగూడ మనకు విశదం చేసాడు. మనకు జీవాన్నిచ్చేది తానేనని స్పష్టం చేసాడు. అతనిద్వారానే గాని మనం తండ్రిని చేరమని రూఢం చేసాడు -146. ఈలా తండ్రినిచేరే మార్గమూ సాధనమూ ఐన ప్రభువుని మనం భక్తిభావంతో వందించాలి.

3. క్రీస్తు తండ్రికి సాక్షి ఈ సాక్షి ధర్మానాకి అతడు తగినవాడుకూడ, అతడు తండ్రికి సరిసమానుడు, తండ్రి శక్తితోనే అద్భుతాలు జేసేవాడు. ఆ తండ్రిలాగే తానూ పరమ పవిత్రంగా జీవించేవాడు. కనుక తండ్రిని గూర్చిన అతని సాక్ష్యం అన్ని