పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

3. క్రీస్తు తండ్రిని తెలియజేసే తీరు

1. నరుడైన క్రీస్తు దేవుడైన తండ్రిని మనకు ఏలా తెలియజేస్తాడు? త్రీత్వంలో పిత, సుతుడు, ఆత్మ అని ముగ్గురు వ్యక్తులున్నారని చెప్పాం. ఈ సుతుట్టే ూసను సువిశేషం "దేవుని వాక్కు” అని పిలుస్తుందనికూడ చెప్పాం. ఈ సుతుడే తర్వాత క్రీస్తుగా జన్మించాడు. త్రీత్వంలోనివాడు కనుక అతనికి తండ్రినిగూర్చి బాగా తెలుసు. తనకు తెలిసిన తండ్రినిగూర్చి అతడు మనకు స్పష్టంగా చెప్పగలడు. కనుకనే యోహాను "తండ్రికి అత్యంత సన్నిహితుడుగా వున్న కుమారుడే ఆ తండ్రిని మనకు ఎరుకపరిచాడు" అని వాకొన్నాడు-1,18.

"క్రీస్తు అదృశ్యుడైన దేవుని ప్రతిబింబం" అన్నాడు పౌలు- కొలో 1,15. ఇంకా “అతడు దేవుని మహిమ యొక్క తేజస్సు, అతని అచ్చమైన ప్రతిరూపం" అని కూడ చెప్పాడు - హెబ్రే 1,3. అనగా క్రీస్తు దేవుణ్ణి పోలినవాడని భావం. దేవుణ్ణి పోలినవాడు కనుకనే అతన్ని మనకు చూపించగల్లుతాడు. ఆ దేవుని వనికినీ, అతని హృదయాన్నీ అతని ప్రేమగుణాన్నీ మనకు విశదీకరించగల్లుతాడు.

క్రీస్తుద్వారా తండ్రి మనలను పిలుస్తాడు. మనలను తన చెంతకు రమ్మని ఆహ్వానిస్తాడు. తండ్రి శబ్దమే క్రీస్తు నోట మనకు విన్పిస్తుంది. ఆ తండ్రి ఆహ్వానాన్ని మనం వినాలి. మనం అతని దగ్గరికి వెళ్ళాలి. అతన్ని మన తండ్రినిగా అంగీకరించాలి. అలా అంగీకరించనివాళ్ళకు శిక్ష తప్పదు.

2. దివ్యశ్రుతి క్రీస్తుతో పరిపూర్ణమౌతుంది, అతనితోనే ముగుస్తుందికూడ ఏనుగు పడితే ఏనుగే లేపాలి. దేవుణ్ణిగూర్చి దేవుడు మాత్రమే సంపూర్ణంగా చెప్పగలడు. క్రీస్తు తండ్రినిగూర్చి నరులమైన మనకు చెప్పవలసిందంతా చెప్పాడు. పూర్వం ప్రవక్తలు పితనుగూర్చి కొన్ని సంగతులు చెప్పారు. ఆ విషయాలు పూర్వవేదంలో వున్నాయి. కాని ఆ ప్రవక్తలకు తెలిసిందే తక్కువ. అసలు తండ్రి రహస్యప్రణాళికనుగూర్చి వాళ్లకు తెలియనే తెలియదు. కనుక వాళ్ళ చెప్పిందిగూడ తక్కువే. పూర్వవేదం తర్వాత చివరి మహా ప్రవక్తగా క్రీస్తు వచ్చాడు. అతడు దేవుని వాక్కూ దేవుని సుతుడూ కనుక దేవుడ్డిగూర్చి సంపూర్ణంగా తెలిసినవాడు. తనకు తెలిసిన సంగతుల్లో అవసరమైన వాటిని అతడు మనకు వివరించాడు. కావున తండ్రి మనతో "నా కుమారుడైన క్రీస్తుద్వారా నన్ను గూర్చిన సంగతులన్నీ నేను మీకు ఎరుకపరచుకొన్నాను" అని చెప్పాడు. కనుకనే హెబ్రేయులజాబు “ఈ కడపటి రోజుల్లో దేవుడు తన కుమారునిద్వారా మనతో మాట్లాడాడు” అంటుంది -1.2