పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విధాల నమ్మదగింది. అసలు తండ్రే క్రీస్తు తన్నుగూర్చి పల్కిన సాక్ష్యాన్ని ధ్రువపరచాడు- యోహా 6,37 ఈలా తండ్రిని ఎరుకపరచే క్రీస్తు సాక్ష్యాన్ని మనం అంగీకరించి విశ్వసించాలి.

4. తండ్రి ఆదాము పాపంద్వారా తనకు దూరమైన నరజాతిని మళ్ళా తన చెంతకు తిరిగి రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తుంటాడు. ఈ యాహ్వానాన్ని తీసికొనివచ్చినవాడు క్రీస్తే, ఇక, తండ్రి ఆహ్వానాన్ని నరులు అంగీకరించాలి, కాని నరజాతి అంతటి తరపున తండ్రి ఆహ్వానానికి అంగీకారం తెలిపిన మహాభక్తుడు క్రీస్తే, అతడు నిరంతరమూ తండ్రి చిత్తప్రకారం జీవించినవాడు. ఆ దివ్యచిత్తాన్నిపాటించడమే అతని ఆహారంకూడ - యోహా 4,34. తండ్రి పంపిన పనిని నెరవేర్చడమూ, తండ్రిని ఆరాధించడమూ, అతని నిత్యకృత్యాలు. కనుక నరులు దేవుని గారాబు బిడ్డల్లా ప్రవర్తించడంలోను, అతని ఆహ్వానాన్ని భక్తిభావంతో అంగీకరించడంలోను క్రీస్తు మనకు ఆదర్శంగాను ప్రేరణంగాను వుంటాడు.

5. వేదాంతియైన తోమాసు అక్వినాసు భక్తుడు ఈలా చెప్పాడు. నరులు తమ భావాలను తోడినరులకు తెలియజేయడానికి వాటిని మాటలతోను ధ్వనులతోను పొదుగుతారు. అలాగే పరలోకంలోని తండ్రికూడ తన భావాలను నరులమైన మనకు వ్యక్తంచేయాలని అభిలషించి వాటికి నరులు అర్థంచేసికొనే రూపాన్ని కల్పించాడు. అనగా తన భావాలకు నరాకృతిని దయచేసాడు. శాశ్వతమైన తన వాక్కును నరుద్ధిచేసి లోకంలోకి పంపాడు, అలా వచ్చిన దైవవాక్కగు క్రీస్తు తన్ను పంపిన దేవుణ్ణి మనకు విశదం చేసాడు. కనుక ఆ ప్రభువుకి మనం భక్తితో ప్రణమిల్లాలి.

6. క్రీస్తు సిలువ

క్రీను యూజకుడుగా మనకొరకు చనిపోయాడు. పవిత్రమైన తన సిలువమరణంద్వారా మనకు పాపపరిహారం చేసాడు. ఈ యధ్యాయంలో ఐదంశాలు పరిశీలిద్దాం.

1. క్రీస్తు మరణానికి కారణం ప్రేమే

క్రీస్తు తండ్రిపట్లగల ప్రేమచేతనే సిలువ మరణానికి సంసిద్ధమయ్యాడు. "నేను తండ్రిని ప్రేమిస్తున్నానని లోకం తెలిసికోవాలి. ఆ తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికే నేనీలాగు