పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. పితృపాదుల బోధలు

క్రీస్తు తండ్రిని తెలియజేసేవాడు అనే అంశాన్ని గూర్చి పితృపాదులు చాల సంగతులు చెప్పారు.

1. అనాదినుండీ తండ్రి సుతుడూ వున్నారు. సుతునికి తండ్రినిగూర్చి బాగా తెలుసు. ఆ సుతుడే క్రీస్తుగా జన్మించాడు. కనుక అతడు తండ్రినిగూర్చి మనకు క్షుణ్ణంగా చెప్పగలడు. క్రీస్తు తన తండ్రి మనలను ప్రేమిస్తాడని చెప్పాడు. మనం అతనికి దత్తపుత్రులమౌతామని కూడ చెప్పాడు. కనుకనే మనం ఆ దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి సాహసిస్తున్నాం.

క్రీస్తులో తండ్రి మనకు దర్శనమిస్తాడు. ఈ సందర్భంలో రోమాపురి క్లెమెంట్ "క్రీస్తు అనే అద్దంలో తండ్రి ముఖం ప్రతిబింబిస్తుంది" అని వ్రాసాడు. అనగా క్రీస్తులో తండ్రి మనకు ప్రత్యక్షమౌతాడని భావం. పితృపాదులు క్రీస్తుని తండ్రి దూత, తండ్రి ప్రవక్త, తండ్రి వాక్కు తండ్రి వాణి అని పేర్కొన్నారు.

2. పితృపాదులందరిలోను రెండవ శతాబ్దానికి చెందిన ఇరెనేయుస్ భక్తుడు క్రీస్తు శ్రుతికకర్త అనే అంశాన్ని చక్కగా విశదీకరించాడు. ఈతని భావాల ప్రకారం, దేవుని వాక్కు నరుడై జన్మించినవుండకపోయినట్లయితే మనకు దేవుణ్ణిగూర్చి తెలిసేదే కాదు. ఆ దేవుడ్డిగూర్చి మనకు చెప్పగల్గిన వాళ్ళ ఇంకెవరున్నారు? కనుకనే కంటికి కనిపించని దేవుడ్డిగూర్చి కంటికి కన్పించే కుమారుడే చెప్పాలి. అది మరొకరికి సాధ్యమయ్యే పనికాదు.

ఇరెనేయస్ రక్షణ చరిత్రను మూడు దశలుగా విభజించాడు. తొలిదశ, సృష్ణ్యాదినుండి యూదులను ఎన్నుకొనేంత వరకూను. తండ్రి తన వాక్కుద్వారా సృష్టిచేసాడు. ఈ సృష్టినుండి పితను కొంతవరకు తెలిసికోవచ్చు. రెండవ దశ, యూదుల ఎన్నిక. తండ్రి తన వాక్కు ద్వారానే యూదులనుకూడ ఎన్నుకొన్నాడు. యూదుల ధర్మశాస్త్రం ద్వారా గూడా తండ్రిని గూర్చి కొంతవరకు తెలిసికోవచ్చు. ఈ రెండు దశల్లోను వాక్కు లేక సుతుడుకూడ ప్రత్యక్షమై వున్నాడు. ఈ రెండు దశల్లోను అతడు రాబోయే నరావతారానికి తన్నుతాను తయారుచేసికొంటున్నాడు. ఇక మూడవ దశ, నూత్నవేదం, తొలి రెండు దశల్లోను కంటికి కన్పింపకుండా వున్నదేవుని వాక్కు ఈ మూడవదశలో మానవాకారం చేకొని కంటికి కన్పించడం మొదలుపెట్టింది. ఇదే క్రీస్తు మనుష్యావతారం. ఈ క్రీస్తు తండ్రిని పరిపూర్ణంగా తెలియజేస్తాడు. ఇవి ఇరెనేయుస్ భావాలు. రెండవ శతాబ్దంలో Es వేదశాస్త్రి చెప్పిన భావాలు నేటికీ మనకు ప్రేరణం పట్టిస్తాయి.