పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వవేదంలో యావే ప్రభువు ఒక్క పలుకు పలకగానే కార్యం జరిగేది. ప్రభువు ఆజ్ఞాపింపగానే సృష్టి జరిగింది అంటుంది కీర్తన 148,5. క్రీస్తు వాక్కుకి గూడ ఈ క్రియాశక్తి వుంది. ప్రభువు ఒక్కమాటతో పిశాచగ్రస్తుల నుండి దయ్యాలను పారద్రోలి రోగుల వ్యాధులను కుదిర్చాడు - 8,16. ఈలాంటి వాక్షుక్తిద్వారా అతడు తండ్రిని మనకు బయలుపరుస్తాడు. కనుక అతని పలుకులు ఏ నాటికీ గతింపవు - మార్కు 13,31.

4. యేసు శ్రుతికర్త అనే భావాన్ని నూత్నవేద రచయితలందరికంటెగూడ యోహాను ఎక్కువగా పేర్కొన్నాడు. ఏ నరుడూ దేవుణ్ణి చూడలేదు. ఆ దేవుడికి సన్నిహితుడుగా వుండి స్వయంగా దేవుడైన కుమారుడే అతన్ని మనకు ఎరుకపరచాడు - 1,18. కనుక క్రీస్తులేందే మనకు తండ్రినిగూర్చి తెలియదు. ఇంకా క్రీస్తు, ఈ లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నేను నిన్నుతెలియజేసాను అని తన తండ్రితో చెప్పాడు — 17,6.

ఫిలిప్ప ఓ మారు ప్రభూ! నీవు మాకు తండ్రిని చూపించు, మాకు అదే చాలు అని అడిగాడు. క్రీస్తు, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే అని జవాబిచ్చాడు148–9. ఇది మహావాక్యం. క్రీస్తులో తండ్రి మనకు కన్పిస్తాడు. అతని మాటల్లోను చేతల్లోను పిత మనకు ప్రత్యక్షమౌతాడు.

యోహాను సువిశేషంలోని తొలి 18 వాక్యాలు చాల ముఖ్యమైనవి. ఈ ప్రారంభ భాగంలో అతడు క్రీస్తుని "వాక్కు” అని పిలుస్తాడు. “ఆదిలో వాక్కువుంది, ఆ వాక్కు దేవునివద్ద వుంది, ఆ వాక్కు దేవుడే" అని చెప్పాడు-1,1. పూర్వవేదంలో దేవుని వాక్కు అంటే దేవుడే కనుక దేవుని వాక్కుకి దేవునికున్నంత శక్తి వుంటుంది. ఇక, నూత్నవేదంలో క్రీస్తే ఈ వాక్కు అతనికీ దేవునికుండే శక్తి వుంటుంది. త్రీత్వంలోపిత, సుతుడు, ఆత్మ అని ముగ్గురు దైవవ్యక్తులున్నారు. ఆ ముగ్గురిలో సుతుడు నరుడై జన్మించాడు. అతడే క్రీస్తు. అతడే దేవుని వాక్కుకూడాను. కనుక అతడు దేవునితో సరిసమానుడు. పితతో సరిసమానుడు కనుకనే అతన్ని మనకు బాగా తెలియజేయగలడు.

పైన మనం పేర్కొన్న వేదవాక్యాల సారాంశమిది. క్రీస్తు మనకు తండ్రిని తెలియజేస్తాడు. పరిపూర్ణంగాగూడ తెలియజేస్తాడు. అతడు దేవుని వాక్కు అతడు కేవలం తన బోధలద్వారా మాత్రమేకాదు, తన చేతలద్వారాగూడా అనగా తన అద్భుతాలు మరడోత్థానాలద్వారాగూడ - ఆ తండ్రిని మనకు ఎరుకపరుస్తాడు. ఈలా ఎరుకపరచడంలో అతన్ని గూర్చిన విషయంకూడ వస్తుంది. ఎందుకంటే తండ్రి రక్షణ ప్రణాళిక నెరవేరేది மூதில் ద్వారానే కనుక క్రీస్తు తండ్రిని తెలియజేసేవాడు, తన్ను తాను తండ్రి పంపినవాణ్ణిగా తెలియజేసికొనేవాడు కూడాను. క్రీస్తు బోధలద్వారా చేతల ద్వారా తండ్రి తన్నుతాను మనకు ఎరుకపరచుకొంటాడు.