పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దయ్యం క్రీస్తు సిలువమీద చనిపోయిందాకా అతన్ని శోధిస్తూనే వుంది. ఐనా ప్రభువు పిశాచ ప్రలోభానికి లొంగనూలేదు, తండ్రి నియమించిన ప్రణాళికకు వ్యతిరేకంగా పోనూలేదు.

2. మామూలుగా శోధనలో మూడు మెట్లుంటాయి. మొదట మనకు ఓ పాపకార్యం చేయాలనే తలంపు వస్తుంది. అటుపిమ్మట ఆ పాపకార్యాన్ని తలంచుకొని ఆనందిస్తాం. కడపట మనం ఆ పాపకార్యాన్ని చేయడానికి సమ్మతిస్తాం. ఈలా తలంపు, ఆనందం, సమ్మతి అనేవి మూడుమెట్లు, వీటిల్లో మొదటి రెండుమెట్ల పాపం కాదు. మూడవమెట్టు మాత్రమే పాపం. పైన క్రీస్తుకి వచ్చిన మూడు శోధనల్లోను అతడు మొదటిమెట్టు దాటిపోలేదు. కాని మన దౌర్భాగ్యమేమిటంటే, ఈలాంటి శోధనలు వచ్చినపుడు మనం చివాలున మూడవమెట్టు చేరుతాం. శోధనలు వచ్చినపుడు క్రీస్తు పాపంలో పడలేదు. అదే శోధనలు వచ్చినపుడు మనం తరచుగా పాపంలో పడిపోతూంటాం.

3. శోధనల్లో మన స్వాతంత్ర్యం నశించిపోతుందా? నశిపందు. మన హృదయం మూసివేసిన కోట తలుపు లాంటిది, పిశాచమనే శత్రువువచ్చి మన హృదయమనే తలుపుమీద దబాదబాబాదగలదేగాని దాన్ని బ్రద్దలుచేసి లోపలికి ప్రవేశించలేదు. మనంతట మనమే బుద్ధిపూర్వకంగా ఈ హృదయ కవాటం తెరిస్తేనే తప్ప, అది యెంత ప్రయత్నం చేసినా మన హృదయంలో ప్రవేశించలేదు, ఇంకా పిశాచం కట్టివేసిన కుక్కలాంటిది. మనంతట మనం చపలచిత్తంతో దాని దాపుకు వెళ్లేనేతప్ప అది మనలను కరవలేదు. ఈ వుపమానాల భావం ఏమిటంటే, శోధనల్లో మన స్వాతంత్ర్యం ఎంతమాత్రమూ దెబ్బతినదు. మనం పూర్ణబలంతో పిశాచంతో పోరాడనూవచ్చు, విజయం సాధించనూవచ్చు. అది యేనాడూ మనలను నిర్బంధం చేయలేదు. కనుక మనం శోధనకు లొంగినపుడు బాధ్యత పూర్తిగా మనదే.

4. క్రీస్తు పరమ పవిత్రుడు. అతనికి శోధనలు సోకవు. కనుక ఇక్కడ అతడు వ్యక్తిగతంగా గాక మన శిరస్సుగా, మన నాయకుడుగా, మన తరపున శోధనలకు గురయ్యాడు. మన శిరస్సునందు మనమందరమూ శోధనలు పొందుతాం. ఐనా అతని అవయవాలంగనుక అతనియందు మనమందరమూ శోధనలు జయించి విజయం సాధిస్తాం. కనుకనే భక్తుడు అగస్తీను "క్రీస్తు మన మానవ స్వభావాన్నిచేకొన్నాడు కనుక మన మానవజాతి శోధనలకు తానూ గురికావలసి వచ్చింది. కానీ మనం అతనితో ఐక్యమౌతున్నాం గనుక పిశాచంమీద అతడు సాధించిన విజయం మనకు సంక్రమిస్తుంది" అని వ్రాసాడు. శోధనలు వచ్చినపుడు ఈ భావం మనకు ధైర్యమూ ఓదార్పూ కలిగించాలి. ఓ బలహీనప తీగ ఓ