పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రహ్మాండమైన చెట్టమీదికి అల్లకుంది. తానూ ఆ చెట్టబిలంలో పాలుపంచుకొంది. కనుక గాలివాన వచ్చినా అది పడిపోలేదు. గొడూగోదా మేయడానికి వచ్చినా అది వాటికి అందలేదు. ఈలాగే మనంతట మనం బలహీనులం. ఐనా మనం బలాఢ్యుడైన క్రీస్తుమీదికి అల్లకొనిపోతాం. శోధనలు వచ్చినపుడు అతని బలం మనలను రక్షిస్తుంది. ఆ ప్రభువు బలవంతుడైన పిశాచాన్ని జయించిన మహా బలశాలి - మత్త 12,29. ఆ బలాఢ్యునిముందు పిశాచబలం ఎందుకూ పనికిరాదు. కనుక శోధనలు వచ్చినపుడు మనం ఆ బలాఢ్యునినుండి బలం అడుగుకోవాలి. ఇంకా పరలోక జపంలో రోజూ "మమ్మ శోధనల్లోకి ప్రవేశింపనీకండి" అని ప్రార్ధిస్తాం. ఈ వాక్యం భావం అసలు మనకు శోధనలే రాకూడదని కాదు. శోధనలు వచ్చినపుడు వాటికి లొంగకుండా వుండడానికి చాలినంత బలం దేవుడు మనకు దయచేయాలని మాత్రమే దీని భావం.

5. నరులకు శోధనలేమో తప్పవు. ఈలోకంలో నరుని జీవితం ఓ యుద్ధరంగంలాంటిది అని చెప్తుంది యోబు గ్రంథం - 7,1. కనుక నరుడు ఇక్కడ నిత్యం పోరాడుతూండవలసిందే. పైగా భగవంతుడు నరుణ్ణి పరీక్షిస్తుంటాడు. ఏలాగ? శోధనల ద్వారా, "నీవు దేవుడికి ఇష్టుడివి కనుక అతడు శోధనలద్వారా నిన్నుపరీక్షింపవలసి వచ్చింది” అని చెప్తుంది తోబీతు గ్రంథం - 12,13. కనుక శోధనలు అవసరం. యుద్ధంలో పోరాడని సైనికునికి కిరీటం ఎలా లభిస్తుంది? శోధనలు అనుభవించనివాడు మోక్షభాగ్యానికి ఏలా పాత్రుడౌతాడు? అందుకే దేవుడు మనకు శోధనలు పంపుతూంటాడు. ఆ ప్రభువు అబ్రాహాము అంతటివాణ్ణి పరీక్షింపగోరాడు. అతడు ఈసాకును తనకు బలిగా సమర్పించాలని కోరాడు - ఆది 22,1. ఇక మనం ఏపాటివాళ్ళం? శోధనలద్వారా మన ఆధ్యాత్మిక జీవనం ఇంకా బలపడుతుంది. కొండమీది చెట్టుకు పెనుగాలులు సోకుతాయి. దాన్ని అటూఇటూ వూపుతాయి. కాని ఆ గాలులవల్ల ఆ చెట్టు వేళ్ళ ఇంకా లోతుగా చొచ్చుకొని పోతాయి,

ప్రభువు మనకు శోధనలు పంపిస్తాడని చెప్పాం. కాని ఈ శోధనల్లో అతడు మనలను ఒంటరిగా వదలివేయడు. తాను మనకు తోడ్పడుతూంటాడు. హెబ్రేయుల జాబు రెండు తావుల్లో శోధనలు వచ్చినపుడు క్రీస్తుని ఆశ్రయించమని చెప్తంది. ఆ ప్రభువు తానుకూడ శోధనలకు గురైనవాడు. కనుక శోధనలు తెచ్చిపెట్టే బాధలు అతనికి బాగా తెలుసు. అందువల్ల ఇప్పడు అతడు శోధింపబడేవాళ్ళకు సహాయం చేయడానికి సిద్ధంగా వుంటాడు - 2,18.

ఆ ప్రభువుకి మన బలహీనతలు బాగా తెలుసు. అతడు దేవదూతల కుటుంబంలోగాక, అచ్చoగ మానవుల కుటుంబంలో పట్టినవాడు. మనకు పెద్దన్న.