పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/243

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

17. నిబంధనకారుడు

1. నిబంధనం అంటే యేమిటి?

దేవుడు నరులకు తన దివ్యజీవనంలో పాలు ఇవ్వాలని కోరుకొన్నాడు. అందుకే వారితో నిబంధనం చేసికొన్నాడు, పూర్వ నూత్న వేదాల్లోకూడ ఈ నిబంధనభావం చాల ముఖ్యమైంది. అసలు పూర్వవేదాన్ని ప్రాతనిబంధనమనీ, నూత్నవేదాన్ని క్రొత్త నిబంధనమనీ పిలుస్తాంగదా! నిబంధనమంటే రెండుపక్షాలమధ్య జరిగే ఒడంబడిక, ఒప్పందం, ఒడబాటు, ఒప్పకోలు. బైబుల్లో వందలకొలది నిబంధనలున్నాయి. వీటన్నిటిలోను ప్రభువు మోషేద్వారా చేసిన నిబంధనం, క్రీస్తుద్వారా చేసిన నిబంధనం ముఖ్యాతి ముఖ్యమైనవి. బైబుల్లో నిబంధనం జరిగినప్పుడు "నేను వారి దేవుడనౌతాను, వారు నా ప్రజలౌతారు" అనే సాంకేతిక వాక్యం విన్పిస్తుంది. ఈ వాక్యం దేవుని సాన్నిధ్యాన్ని సూచిస్తుంది.

దేవుడు యిప్రాయేలీయులతో నిబంధనం చేసికోకముందే వారి చుటూ వసించే వివిధ జాతి ప్రజల్లో నిబంధనాచారం వుండేది. మామూలుగా రక్షణకోసం ఓ చిన్నరాజు ఓ పెద్దరాజుతో ఒడంబడిక చేసికొనేవాడు, దానికి కొన్ని తంతులుండేవి. ఒడంబడిక చేసికొనేవాళ్ల జంతువులను చంపి వాటి మాంసఖండాల మధ్యగా నడచేవాళ్ళ ఒడబాటును మీరినవాడిని ఆ మాంసఖండాలలాగే ముక్కముక్కలుగా కోయాలని దీని భావం. చిన్నరాజు పెద్దరాజుపట్ల స్వామిభక్తి కలిగి అతని ఆజ్ఞలను పాటిస్తుండాలి. చిన్నరాజు మీదికి ఎవడైనా యుద్ధానికివస్తే పెద్దరాజు అతన్నికాపాడాలి. ఒడబాటును ధ్రువపరుస్తూ ఇరుపక్షాలవాళ్ళ కలసి భోజనం చేసేవాళ్ళు ఒప్పకోలు జరిగిన తావుల్లో జ్ఞాపకార్థంగా ఓ రాతి స్తంభాన్ని నిలిపేవాళ్లు, లేదా ఓ చెట్టును నాటేవాళ్లు, కొన్ని సార్లు వివాహాన్నిగూడ భార్యాభర్తల మధ్య ఒడంబడికగా భావించారు. ఉభయపక్షాలు పరస్పర సహాయం పొందడం ఈ నిబంధనం యొక్క ప్రయోజనం. మామూలుగా చిన్నరాజే తనతో నిబంధనం చేసికొమ్మని పెద్దరాజుని వేడుకొనేవాడు. బైబుల్లో భగవంతుడు తన భక్తులతో చేసికొన్న నిబంధనల్లోకూడ ఈ లక్షణాలు చాల వరకు కన్పిస్తాయి.

పూర్వవేదంలో మోషే నిబంధనకుముందే రెండు పెద్ద నిబంధనలున్నాయి. మొదటిది, దేవుడు నోవాతో చేసికొన్న నిబంధనం, ఆదికాండం 9,8-16 వచనాలు ఈ యంశాన్ని వర్ణిస్తాయి. ఇక్కడ దేవుడు నోవాద్వారా సృష్టి అంతటితోను నిబంధనం చేసికొన్నాడు. ఈ వొడంబడికకు గుర్తు ఆకాశంలో కన్పించే వర్దగుడి. ఈ వాడబాటు ఫలితం, నీటిముంపువల్ల ప్రపంచం మరల నాశంగాకుండా వుండడం.

రెండవది, ప్రభువు అబ్రాహాముతో చేసికొన్న నిబంధనం, ఆదికాండం 15వ అధ్యాయం ఈ యంశాన్ని పేర్కొంటుంది. దీన్ని ప్రభువు అబ్రాహాముతోను అతని అనుయాయులతోను మాత్రమే చేసికొన్నాడు. దీనికి గురుతు అబ్రాహామూ అతని