పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంతతివారూ సున్నతిని పొందడం. ఈ వాడబాటు ఫలితాలు రెండు. మొదటిది, అబ్రాహాము సంతతి ఆకాశంలోని చుక్కల్లాగ లెక్కలకందనిరీతిగా విస్తరిల్లుతుంది. రెండవది, వాళ్ల కనాను దేశాన్ని తరతరాలవరకు వారసంగా స్వీకరిస్తారు.

2. సీనాయి నిబంధనం

ఇది నిర్గమకాండంలో వస్తుంది. ఈ నిబంధనం పూర్వవేదానికంతటికీ పునాదిలాంటిది. ఇది మామూలు నిబంధనల్లాంటిదికాదు. ఇక్కడ ఉభయపక్షాలు సరిసమానమైనవికావు. దేవుడు గొప్పవాడు, యిప్రాయేలీయులు అల్పులు. పైగా గొప్పవాడైన దేవుడే నిబంధనాన్ని తలపెట్టాడు. అల్పులైన యిస్రాయేలీయులు దానికి సమ్మతించారు. కనుక ఈ వొప్పందానికి దేవుడే కారకుడు.

నిర్గమకాండం 19,16-20లో ప్రభువు సీనాయి కొండ మీదికి దిగివస్తాడు. అతడు కారుమబ్బుల్లో పొగల్లో సెగల్లో భూకంపంలో ఉరుముల్లో దర్శనమిస్తాడు. మోషే మాత్రమే కొండమీద అతన్ని దర్శిస్తాడు. ప్రజలంతా కొండక్రిందనే వుంటారు.

అదే పుస్తకం 24,3-11ఒడంబడికను వర్ణిస్తుంది. మోషే యావే నియమించిన నిబంధన నియమాలన్నిటినీ ప్రజలకు వివరించాడు. వాళ్లు వాటిని పాటిస్తామని ప్రతిజ్ఞ చేసారు. తర్వాత మోషే సీనాయికొండ దగ్గర బలిపీఠాన్ని నిర్మించాడు. పండ్రెండు తెగల యిస్రాయేలీయులకు గుర్తుగా పన్నెండు రాళ్లు పాతాడు. అటుపిమ్మట కోడెను వధించారు. మోషే దాని నెత్తుటిలో సగం పీఠంమీదా, సగం ప్రజలమీదా చల్లాడు. "ప్రభువు మీతో చేసికొన్న నిబంధనకు సంబంధించిన రక్తం ఇదే" అని చెప్పాడు- 24,8, ఇక్కడ ఈ నెత్తురుద్వారానే నిబంధనం జరిగింది. బలిపీఠం దేవునికి గుర్తు. ఆ పీఠంద్వారా ప్రజలమీద పడిన నెత్తురు ఆ ఉభయ పక్షాలను ఐక్యపరచింది. నెత్తురులో ప్రాణముంటుంది. ఆ ప్రాణం దేవునిదే - లేవీ 17,11. కనుక ఈ నెత్తటి చిలకరింపుద్వారా దేవుడు యిస్రాయేలీయులను తనతో ఐక్యపరచుకొన్నాడు. కట్టకడన మోషే 70 మంది యిప్రాయేలు పెద్దలు కొండమీద దేవుని యెదుట భోజనం చేసారు. సీనాయి నిబంధనం సంగ్రహంగా యిదే. ఇక, ఈ నిబంధన భావాలు జాగ్రత్తగా గుర్తించాలి.

1. దేవుని రక్షణ ప్రణాళికలో నిబంధనం

ప్రభువు యిప్రాయేలీయులతో ఎందుకు ఒడంబడిక చేసికొన్నాడు? వాళ్ళను తన ప్రజలనుగాజేసికోడానికీ, వాళ్ళకు తన రక్షణను ప్రసాదించడానికీని. కనుకనే అతడు యిస్రాయేలీయులతో "మీరు నా మాట విని నా నిబంధనాన్ని శ్రద్ధగా పాటిస్తే సకల జాతుల్లోను మీరే నావాళ్ళూ, నా సొంత ప్రజలూ ఔతారు. భూమండలమెల్ల నాదే. మీరేనాకు యాజక రూపరాజ్యమూ, నా పవిత్రప్రజ ఔతారు" అని చెప్పాడు - 19,5-6. అనగా భూమిమీది జాతులన్నిటిలోను ప్రభువు యిప్రాయేలునే తన జాతిగా ఎన్నుకొన్నాడు. వాళ్ల