పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోరుకొన్నారు - ఆది 25,8. కీర్తనకారుడు "సజీవుల లోకంలో ప్రభువు వుపకారానికి పాత్రుడనౌతానని నా నమ్మకం" అన్నాడు – 27, 13. ఈ సజీవులలోకం భూలోకమే.

బిడ్డలు క్రొత్తజీవానికి సూచనం. ఒక విధంగా చెప్పాలంటే, తల్లిదండ్రులజీవం బిడ్డల్లో కొనసాగుతుంది - ఆది 15,2-3. కనుక తల్లిదండ్రులు తమకు చాలమంది బిడ్డలు కలగాలని కోరుకొన్నారు. వృద్దులూ పసిపిల్లలూ కూడ వీధుల్లో గుంపులు గుంపులుగా కనిపించాలని కోరుకొన్నాడు జెకర్యాప్రవక్త "పండుముదుసళ్ళ మరల ఊతకర్ర పట్టుకొని నగర వీధుల్లో కూర్చుంటారు. పురవీధులు మళ్లా ఆటలాడుకొనే బాలబాలికలతో నిండివుంటాయి" అన్నాడు –8,4-5.

2.ప్రాణం నశ్వరమైంది

ప్రాణం ఎంత విలువైందైనాసరే మృత్యువు దాన్ని నిరంతరం కబళింప జూస్తూంటుంది. కనుక జీవానికి అపాయం మెండు. కీర్తనకారుడు దేవుణ్ణి సంబోధిస్తూ
"నీవు ప్రాణుల ఊపిరితీస్తే అవి చస్తాయి
తాము పట్టిన మట్టిలోనే కలసిపోయతాయి"
అంటాడు- 104,29. ఇంకా, యీ జీవితం క్షణికమైంది. కనుకనే యోబు గ్రంథం
"నారికి జన్మించిన నరులు అల్పాయుష్కులు
బహు వేదనలకు గురయ్యేవాళ్ళ"
అంటుంది – 14,1. ఇంకా “నరుడు స్వప్నంవలె మరుగైపోతాడు" అనికూడ చెప్మంది - 20,8. 103వ కీర్తన నరులను వర్ణిస్తూ
"నరుల జీవితం గడ్డిపరకలాంటిది
పిచ్చి మొక్కలు పూచే పూవులాంటిది
ఆ పూవుమీద గాలి తోలితే రాలిపోతుంది
అది యుక ఎవరికంటూ బడదు?
అని చెప్తుంది - 103, 15-16 సొలోమోను జ్ఞానగ్రంథం "మన ఊపిరి పొగవంటిది" అంటుంది - 2,2. 144వ కీర్తన
"నరుడు అల్పమైన శ్వాసంవంటివాడు
అతని రోజులు నీడలాగ సాగిపోతాయి”
అని నుడువుతుంది - 144,4. ఇంకా 39వ కీర్తన
"నీవు నాకు క్షణభంగురమైన ఆయువు నిచ్చావు"
అని చెప్తుంది - 39,5. నరుడు మట్టినుండి పట్టాడు కనుక మట్టిలోనే కలసిపోతాడు - ఆది 3,19. కాలం గడచేకొద్దీ అతని యేండ్లు 120కీ, 80 లేక 70 కీ గూడ దిగజారిపోతాయి - ఆది 6,3. కీర్త 90,10. ఇది నరుని దుర్బలత్వం.