పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాటి గొంతునుండి ఒక్క మాటకూడ రాదు
ఆ బొమ్మలను మలచినవాళ్ళూ వాటిని నమ్మేవాళ్ళూ
వాటివంటివాళ్ళే ఔతారు" - 115, 5-8
దేవుడు సజీవుడు అంటే అతనిలో జీవం పరిపూర్ణంగా వుందని భావం. అతడు లోకాన్ని సృజించి ప్రాణులన్నిటికీ జీవమిస్తాడు. అతడు నరులతో మాట్లాడతాడు, వారిని నడిపిస్తాడు, శిక్షిస్తాడు, రక్షిస్తాడు. అతడు ప్రధానంగా క్రియాపరుడు. పూర్వవేదంలోని దేవునికి యావే (యాహ్వే) అని పేరు. ఈ పేరు "హయ్యా" అనే హీబ్రూ మూలపదం నుండి వస్తుంది. ఉనికిలో వున్నవాడు, క్రియను చేసేవాడు అని ఈ మూలపదానికి అర్థం. అతడు ప్రధానంగా రక్షణ క్రియను నిర్వహించేవాడు. దానియేలు గ్రంథం వచించినట్లు
“అతడు సజీవుడైన దేవుడు
కలకాలం పరిపాలించేవాడు
అతని రాజ్యం ఎన్నడూ నాశంకాదు
అతని పరిపాలనానికి అంతం వుండదు
అతడు ప్రజలను రక్షించి కాపాడతాడు
భూమ్యాకాశాల్లోను అద్భుతకార్యాలు చేస్తాడు
అతడు దానియేలుని సింహాల గుంటనుండి విడపించాడు"
6,26-27. పై వుదాహరణలనుబట్టి బైబులు భగవంతునికి జీవమంటే ఎంత యిష్టమో, రక్షణకార్యం నిర్వహించడంమంటే యెంత ప్రీతో అర్థంచేసికోవచ్చు

2. జీవం అమూల్యమైంది

1. ప్రాణం ఎంతో విలువైంది

ఆదికాండంలోని సృష్టికథలో ప్రాణమున్న జీవులు కట్టకడన సృజింపబడ్డాయి. సృష్టివారంలో ఐదవరోజున గాని దేవుడు ప్రాణులను కలిగించలేదు - ఆది 1,20. ఈ జీవులన్నిటిలోను ఉన్నతులైన నరులను ఆరవరోజునగాని సృజింపలేదు - 1, 24. పైగా, అలా వున్నత జీవులైన నరులను సృజించిన తర్వాత దేవుడు వారిని దీవించాడు, "మీరు చాలమంది బిడ్డలను కని వృద్ధిచెందండి. భూమండల మంతట నివసించి దానిని వశంజేసికొనండి" అని పల్మాడు - ఆది 1,28. కనుక ప్రాణిసృష్టి అందులోను నరులసృష్టి సృష్టికంతటికీ మకుటాయమానమైంది అనుకోవాలి. నరుడు దేవునికి పోలికగా వుండేవాడు కదా!

ప్రాణం విలువైంది. కనుక యిస్రాయేలు ప్రజలు భూమిమీద దీర్ఘకాలం బ్రతకడం మహాభాగ్యమను కొన్నారు. అబ్రాహాములాగ పండుముసలితనంలో రాలిపోవాలని