పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/234

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

3. ప్రాణం పవిత్రమైంది

క్షణభంగురమైనదైనా కూడా నరుని ప్రాణం పవిత్రమైంది. ప్రతి జీవి జీవంకూడ పవిత్రమైందే, నరుని ప్రాణం ఇంకా యొక్కువ పవిత్రమైంది. ఎందుకంటే అతని ప్రాణం దేవుని శ్వాసే. దేవుడు నరుని ముక్కుగోళ్ళలోనికి ప్రాణవాయువును ఊదితే అతడు సజీవి అయ్యాడు - అది 2,7.

“అతడు ప్రాణుల కొసగిన ఊపిరి తీసికొంటే,
తానిచ్చిన ప్రాణాన్ని తాను మరల చేకొంటే,
జీవులన్నీ నశిస్తాయి
నరుడు మట్టిలో కలసిపోతాడు
-యోబు 34,14-15. దేవుని ఊపిరి కలవాడు కనుక నరుణ్ణి హత్యచేయకూడదు -నిర్గ 20,13. ప్రభువు కయీనులాంటి దుర్మార్ణుణ్ణి కూడ అప్పటికప్పుడే చంపలేదు. ప్రాణంమీద అతనికుండే గౌరవం ఆలాంటిది - ఆది 15,4.

జీవులకు దేవుడిచ్చిన ప్రాణం వాటి రక్తంలో వుంటుంది. కనుక నరుడు జంతువును తినవచ్చునుగాని దాని రక్తాన్ని ఆరగించకూడదు. ఈ రకాన్ని బలిపీఠంమీద చిలికించి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయవచ్చు. కాని దాన్ని భుజించకూడదు - లేవీ 17, 11-12.

3. దేవుడు జీవాన్నిస్తానని వాగ్దానం చేసాడు

1) జీవమూ కట్టడలూ

ఎవని మరణం వలనా దేవునికి సంతోషం కలుగదు, నరులు తమ పాపాలనుండి వైదొలగి మళ్ళా బ్రతకాలనే అతని కోరిక - యెహెజ్కేలు 18,32. దేవుడు నరుణ్ణి చావడానికిగాదు బ్రతకడానికే చేసాడు.

"దేవుడు నరుజ్జీ అమరుజ్జీగా జేసాడు"
—సాలో 223. నరునికి శాశ్వత జీవమీయడానికి ఏదెను తోటలో జీవమిచ్చే పండ్ల చెట్టునుగూడ నాటాడు. కాని నరుడు దేవుని છઠ્ઠું మీరాక అతనికి ఆ చెట్టదగ్గరికి వెళ్ళే హక్కుపోయింది - ఆది 2,22-23. ఆ పాపదశలో గూడ నరుడు దేవుని ప్రాణాన్ని తీసివేయలేదు. అతని అమరత్వాన్ని మాత్రం తొలగించాడు. అతన్ని నిత్యుని నుండి అనిత్యుణ్ణిగా మార్చాడు. ఐతే జీవానికి చేరే మార్గాన్ని మాత్రం అతనికి చూపించాడు - కీర్త 16,11. ఈ మార్గం ధర్మశాస్త్ర మార్గమే. మోషే కట్టడలను అనుసరిస్తే చాలు నరునికి జీవం కలుగుతుంది. కనుకనే ప్రభువు "మీరు నా యాజ్ఞలను అనుసరిస్తే చాలు జీవాన్ని పొందుతారు" అని చెప్పాడు - లేవీ 18,5. ఆజ్ఞలను పాటించేవాళ్ళకు ధన్యతలు సిద్ధిస్తాయి. వాళ్ళ పర్ణాయుష్ములౌతారు - నిర్గ 23,26. ఇంకా, బరూకు గ్రంథం ఈలా చెప్పంది