పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంకా ఈ గ్రంథం ఈలా చెప్తుంది. "ఓక దేవదూత నన్ను సమీపించి గొర్రెపిల్లకు భార్యగావుండే వధువును నీకు చూపిస్తాను రమ్మన్నాడు" - 21, 9. ఇక్కడ ఈ గొర్రెపిల్ల ఉత్దానక్రీస్తే, అతని భార్య లేక పరలోకపు యెరూషలేము మోక్షవాసులు.

ఈ విధంగా ఈ లోకంలోను పరలోకంలోనుగూడ మనం క్రీస్తు వధువుగానే చలామణి ఔతాం. ఆ ప్రభువు మనకందరికీ వరుడుగానే వుంటాడు.

ఇంతవరకు నూతవేదంలో మనం చూచిన భావాల సారాంశమిది. 1. జ్ఞాస్నానం ద్వారా మనం క్రీస్తు వధుమోతాం. 2. తప్పలు చేసినపుడు పాపపు వధుమోతాం. ఐనా క్రీస్తు దయతో మనలను మన్నిస్తాడు. 3. పరలోకంలో గూడ మనం క్రీస్తు వధువుగానే చలామణి అవుతాం.

నూత్నవేదంలో ప్రధానంగా శ్రీసభ క్రీస్తు వధువు. అనగా దైవప్రజలందరూ కలసి అతని వధువొతారు. ఐనా ఒక్కొక్క వ్యక్తిగూడ క్రీస్తు వధువనే చెప్పవచ్చు. ఈ వ్యక్తిగత భావాన్నిగూడ నూత్నవేదం అంగీకరిస్తుంది. బైబులు కాదుగాని, క్రైస్తవ ఆధ్యాత్మిక గ్రంథాలు ఈ వ్యక్తిగత వధువు అనే భావాన్ని విపులంగా వర్ణిస్తాయి.

ప్రార్థనా భావాలు

1. ఈ వ్యాసంలో భగవంతుడు మనకు వరునిలాంటి వాడనీ, అతన్ని భక్తితో కొలిచే మనం ఆ ప్రభువు వధువులాంటి వాళ్ళమనీ చెప్పాం. బైబులు మనుష్యభాషలో, మనుష్యుల భావాలతో మాట్లాడుతుంది. మనుష్యలోకంలో భార్యాభర్తలమధ్య సన్నిహితసంబంధమూ గాఢ ప్రేమావుంటాయి. భక్తులకూ దేవునికీ మధ్యకూడ ఈలాంటి సంబంధమూ అనురాగమూ వుండాలని ఈ వుపమానం భావం. పైగా ఈ భావం ప్రపంచంలోని పెద్ద మతాలన్నిటిలోను కన్పిస్తుంది, మహ్మదీయ మతంలో, విశేషంగా సూఫీ శాఖలో, ఈ భావం వుంది. హిందూ మతంలో ఈ యంశాన్ని మధురభక్తి అంటారు. మనం మీదట చూచినట్ల యూదక్రైస్తవ మతాల్లోను ఈ భావం వుంది. ఇన్ని మాతాలు పేర్కొన్నాయంటే ఈ భావం ప్రశస్తమైందై వుండాలి. కనుక భగవంతుడు భర్తలాంటివాడు మనం అతని భార్యలాంటివాళ్ళం అనే ఈ భావాన్ని చూచి మనం సందేహించనూకూడదు, సిగ్గుపడనూ కూడదు. ఆ ప్రభువుపట్ల మనకుండవలసిన ప్రేమను నొక్కిచెప్పడం మాత్రమే ఈ భావం ఉద్దేశం. అందుచే ఈ భావాన్ని మనం విలువతో చూడాలి.

2. ఈ సందర్భంలో మన ప్రభువైన క్రీస్తుపట్ల మనకున్నప్రేమ ఏపాటిదా అనికూడ చిత్తశుద్ధితో పరిశీలించి చూచుకోవాలి, ప్రభువు ఆనాడు పేత్రుని అడిగినట్లే ఈనాడు మనలను కూడ నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు - యోహా 20,15. ఈ ప్రశ్నకు మనమేమి సమాధానం చెప్తాం?