పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. పందిరిమీదికి అల్లకోకపోతే తీగ చక్కగా పూలు పూయదు, కాయలు కాయదు. మన పందిరి క్రీస్తే మన హృదయం అతనిమీదికి అల్లుకోవాలి. అతన్ని ప్రేమించాలి. లేకపోతే మన క్రైస్తవ జీవితానికి అర్థమేలేదు. ఐతే మన హృదయం క్రీస్తనే పందిరిమీదికి అల్లకొంటూందా లేక ఈ లోకవస్తువులమీదికి అల్లకొంటూందా? చాలమంది ప్రపంచ వస్తువ్యామోహాల్లో చిక్కుకొని క్రీస్తుని విస్మరిస్తూంటారు. ఇది పెద్ద పొరపాటు, క్రీస్తుతో పోల్చిచూస్తే ఈ లోకంలోని వస్తువులన్నీ చెత్తాచెదారంలాగ విలువ లేనివి అన్నాడు పౌలు - ఫిలి 3,8. మనకుకూడ ఈలాంటి పవిత్ర భావం కలిగితే ఎంత బాగుంటుంది!

14. ద్రాక్షలత

ద్రాక్షలు ఓలివులు గోదుమలు పాలాస్త్రీనా దేశంలో ప్రధాన పంటలు. పాలస్తీనాలోను దాని యిరుగుపొరుగు దేశాల్లోను ద్రాక్షసారాయాన్ని విరివిగా వాడేవాళ్ళు సుమేరియనులు బాబిలోనీయులు ద్రాక్షసారాయాన్ని జీవనదాయకంగా భావించారు. యూదులు దాన్ని ద్రాక్షపండ్ల నెత్తురుగా భావించారు. వాళ్ళ భావాల ప్రకారం ప్రాణిప్రాణం దాని నెత్తుటిలో వుంటుంది. కావున ద్రాక్షసారాయంలోగూడ ప్రాణముంటుంది. అనగా అది మనకు జీవాన్నిస్తుంది. కొందరు రబ్బయుల ప్రకారం ఏదెను తోటలోని జీవవృక్షం ద్రాక్షతీగే నూత్నవేదంలో క్రొత్త ద్రాక్షరసం మెస్సీయా కాలానికి చిహ్నం. పాత్ర ద్రాక్షరసం పూర్వవేద కాలానికి చిహ్నం.

1. ఆనందాన్నిచ్చే ద్రాక్ష లత

నోవా మొట్టమొదటిసారిగా ద్రాక్షలను నాటాడు - ఆది 9,20. అనగా జలప్రళయం తర్వాత ప్రభువు నూత్న నరజాతికి దయచేసిన ఆనందాల్లో ద్రాక్షరసంకూడ ఒకటని భావం, యావే తన ప్రజలకు గోదుమలు యవలు అంజూరాలు దానిమ్మలు ఓలివులు ద్రాక్షలు పండే సారవంతమైన గడ్డ నిస్తానని మాటయిచ్చాడు. అలాగే ప్రశస్తమైన కనాను దేశాన్ని వాళ్లకిచ్చాడు - ద్వితీ 8,8. సాలోమోనురాజు కాలంలో ప్రజలు వాళ్ల అంజూరాల క్రిందా ద్రాక్షపందిళ్ల క్రిందా విశ్రమించారు. అది శాంతికి నిలయం - 1 రాజు 425. సజ్జనుని లోగిలిలో అతని భార్య ఫలించిన ద్రాక్షలతలా వొప్పతుంది. అనగా గుత్తులుగుత్తులుగా కాయలుకాచే ద్రాక్ష తీగలాగ ఆమె బహు సంతానవతి ఔతుందని భావం. అహాబురాజు పేదవాడైన నాబోతును చంపించి అతని ద్రాక్ష తోటను దొంగిలించాడు. అలా దొంగిలించడమంటే అతని భార్యను అపహరించడంతో సమానం. కనుక ఏలీయా ప్రవక్త అతన్ని చెడబడతిట్టి శపించాడు - 1 రాజు 21, 1-16, సంగ్రహంగా