పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనగా క్రీస్తుకి, ప్రధానంచేసిన నిష్కళంకమైన కన్యలాంటివాళ్లు" అని చెప్పాడు - 2కొ 113. జ్ఞానస్నానం ద్వారా కొరింతులోని క్రైస్తవులు ఓ కన్యలాగ క్రీస్తుకి ప్రధానం చేయబడ్డారు. అనగా జ్ఞానస్నానంద్వారా వాళ్లు క్రీస్తనే వరునికి వధువయ్యారని భావం. ఇక్కడ పౌలు కొరింతులోని క్రైస్తవ స్త్రీపురుషులందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కనుక క్రైస్తవ స్త్రీపురుషులందరూ ప్రభువు వధువే. పూర్వవేదంలోని యిప్రాయేలు సమాజమంతా యావే వధువు. ఆలాగే నూత్నవేదంలోని క్రైస్త సమాజమంతా క్రీస్తు వధువు. ఈ భాగ్యం మనకు జ్ఞానస్నానంద్వారా సిద్ధిస్తుంది. ఆ సంస్కారంద్వారా మనం క్రీస్తుతో ఐక్యమౌతాం.

5. పాపపు వధువు

పూర్వవేద ప్రజలైన యిస్రాయేలీయులు పాపంజేసి వ్యభిచారిణియైన వధువులాంటివాళ్లు అయ్యారని చెప్పాం. ఆలాగే నూతవేదప్రజలుకూడ పాపంజేస్తుంటారు. అది మన బలహీనత, కాని క్రీస్తు తన వధువైన శ్రీసభ పాపాలను మన్నించాడు. అతడు శ్రీసభను ప్రేమించి ఆ వధువు కొరకు సిలువమీద తన ప్రాణాలను అర్పించాడు. ఆమెను వాక్యబోధతో కడిగి శుద్ధిచేసి పవిత్రురాలిని చేసాడు - ఎఫె5,25-28. అనగా క్రీస్తునిగూర్చి బోధించడంవల్ల ప్రజలు ఆ ప్రభువుని విశ్వసించి అతని పేరుమీదిగా జ్ఞానస్నానం పొందుతారని భావం.

ప్తె వాక్యాలనుబట్టి మనం పాపంజేసినపుడల్లా పాపపు వధువులా తయారౌతాం అనుకోవాలి, కాని యావే ప్రభువు లాగే క్రీస్తుకూడ దయామయుడు, మన తరపున మనం పశ్చాత్తాపపడితే చాలు, క్రీస్తు మనలను క్షమిస్తాడు.

6. భావికాలపు వధువు

పూర్వవేదం నూత్న వేదంలో జరగబోయే సంఘటనలను సూచిస్తుంది. నూత్నవేదం భావికాలంలో జరగబోయే సంఘటనలను సూచిస్తుంది. భావికాలమంటే పరలోకం, మోక్షం, క్రీస్తు వధువు భావికాలంలో ఏలా వుంటుంది?

నూత్నవేదంలో చివరి పుస్తకమైన దర్శన గ్రంథం ఈ భావికాలపు వధువును ఈలా వర్ణిస్తుంది. "అనంతరం నేను స్వర్గంలోని దేవుని వద్దనుండి దిగివస్తూన్న పవిత్ర నగరమైన నూత్న యెరూషలేమును చూచాను. ఆమె తన భర్తను చేరుకోవడానికి అలంకరించుకొని సిద్ధంగా వున్న వధువులా వుంది" - 21,2. ఇక్కడ మోక్షాన్నిచేరుకొన్న విశ్వాసులే పరలోకపు యెరూషలేము అనే వధువు. ఆమె భర్త క్రీస్తే కనుక పరలోకంలోని మోక్షవాసులు కూడ క్రీస్తు వధుమోతారు.