పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒహోలా, ఒహోలీబా అనే అక్కా చెల్లెళ్ళనుగా భావించాడు. వాళ్ళిద్దరూ యావే వధువులన్నాడు. కాని ఆ యిద్దరు ఒకరిని మించి ఒకరు వ్యభిచారానికి పాల్పడి ప్రభువుకి ద్రోహం చేసారని వాక్రుచ్చాడు. అతని ప్రవచనం 23వ అధ్యాయమంతా ఈ యంశాన్నే చెప్పంది.

ప్రభువు యిప్రాయేలు వధువు పాపానికి ఆమె మీద తీవ్రంగా కోపించాడు. ఆ ప్రజలతో "మీరు నా జనులు కాదు, నేను మీ దేవుణ్ణికాదు" అని పలికాడు - హోషే 19.

3.క్షాంతవధువు

ప్రభువు యిస్రాయేలీయుల విగ్రహారాధనం మొదలైన పాపాలకు వాళ్ళమీద కోపించాడు. బాబిలోనియా రాజైన నెబుకద్నెనరును వాళ్ళమీదికి పంపాడు, ఆ రాజు క్రీ.పూ1586లో యెరూషలేమును నాశంజేసి యూదులను బాబిలోనియాకు ప్రవాసులనుగా తీసుకవెళ్ళాడు. మొదటి ప్రవాసం మోషే కాలంలో, ఐగుప్త దేశంలో అది 400 యేండ్లు కొనసాగింది, ఈ రెండవ ప్రవాసం బాబిలోనియాలో ఇది 70 యేండ్లు కొనసాగింది. ఈ రెండవ ప్రవాస కాలంలో యూదులు తమ పాపాలకు పశ్చాత్తాపపడ్డారు. అందుచే ప్రభువు వాళ్ళ నేరాలను మన్నించి వాళ్ళను మల్లా యెరూషలేముకు తీసికొని వచ్చాడు. కనుక వాళు క్షాంత (క్షమింపబడిన) వధువులాంటివాళ్లు అయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హోషేయ ప్రవచనంలో ప్రభువు

"నేనామెను ఆకర్షించి ఎడారిలోకి కొనిపోతాను
అచట ఆమెతో ప్రేమసంభాషణలు నడుపుతాను"
అంటాడు - 2,14. అనగా యిప్రాయేలీయులు పూర్వం ఐగుప్త నిర్గమనకాలంలో ఎడారి ప్రయాణమందు ప్రభువుపట్ల ప్రేమ జూపినట్లే, ఈ ద్వితీయ నిర్గమనకాలంలో ఎడారి ప్రయాణ మందు మళ్ళా అతనిపట్ల ప్రేమ జూపుతారని అర్థం. ఈ ప్రేమ యిప్రాయేలీయులు ప్రభువుతో నూతనిబంధనం చేసికోవడంలాంటిది. అతన్ని నూత్నంగా వివాహం చేసి కోవడం లాంటిది. కనుకనే అతడు హోషేయ ప్రవచనంలో
“యిస్రాయేలూ! నేను నిన్ను
నా భార్యనుగా జేసికొంటాను
నీతితో న్యాయంతో కరుణతో కృపతో
నిన్ను కలకాలం నాదానినిగా జేసికొంటాను
నీవు నేను ప్రభువునని గ్రహిస్తావు" అంటాడు - 2, 19-20,

ఇదే భావాన్ని మహా ప్రవక్తయైన యెషయా ఇంకా సుందరంగా వర్ణించాడు. అతడు తన ప్రవచనం 54, 5-10లో ప్రభువు వధువైన యిప్రాయేలు నుద్దేశించి ఈలా పల్మాడు