పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంటాడు. ఈ రాణి యిస్రాయేలు ప్రజే. ఆ వధువు తన భర్తయైన ప్రభువుకి భక్తివిశ్వాసాలతో ప్రేమానురాగాలతో నమస్కరించాలని భావం.

2. వ్యభిచారిణియైన వధువు

యిస్రాయేలీయులు ఎడారియాత్ర ముగించుకొని కనాను మండలం ప్రవేశించి అక్కడ స్థిరపడ్డారు. కొంత కాలంపాటు గిద్యోను, సంసోను మొదలైన న్యాయాధిపతులు వారిని పరిపాలించారు. అటుపిమ్మట సౌలు దావీదు సొలోమోను మొదలైన రాజులు ఏలారు. యిప్రాయేలీయులు ఆ గడ్డమీద కాలుమోపినప్పటినుండి వాళ్ళకో పెద్ద ప్రలోభం ఎదురైంది. కనాను దేశంలోని స్థానికి ప్రజలు బాలు దేవతను కొల్చేవాళ్ళు వాళ్ళను చూచి యిస్రాయేలీయులుకూడ ఈ దేవతను కొలవడం మొదలెట్టారు. విగ్రహారాధనకు పాల్పడ్డారు. ఈ పాపాన్నే పూర్వవేదం చాల తావుల్లో "వ్యభిచారం" అని పిలుస్తుంది. వ్యభిచారంలో భార్య తన భర్తను విడనాడి అన్యపురుషుని సమీపిస్తుంది. అలాగే యిస్రాయేలీయులు తమ దేవుడైన ప్రభువును విడనాడి అన్యదైవమైన బాలు దగ్గరికి వెళ్ళేవాళ్లు, ఈ యర్థంలో ఈ విగ్రహారాధనం వ్యభిచారమైంది. ఆ ప్రజలకు యావే పట్ల భక్తి సన్నగిల్లిపోవడం వల్ల ఈ పాపకార్యానికి తెగించారు.

మొట్టమొదటిసారిగా విగ్రహారాధనను వ్యభిచారంతో పోల్చిన ప్రవక్త హోషేయ, ఇతని భార్యయైన గోమెరు పెనిమిటిని విడనాడి ఓ కనానీయుల దేవళంలో వ్యభిచారిణిగా కుదిరింది. ఈమెను హోపేయ చాల అనురాగంతో చూచుకొనేవాడు. కనుక గోమెరు చేసిన ఈ యపరాధానికి ప్రవక్త చాల నొచ్చుకొన్నాడు. దైవప్రేరణంపై అతడు తన జీవితంలోని విషాద సంఘటననే యిస్రాయేలు ప్రజలకుగూడ అన్వయించాడు. గోమెరు భర్తను విడనాడి వ్యభిచారిణియైనట్లే యిస్రాయేలు ప్రజ అనే వధువు తన భర్తయైన యావేను విడనాడి బాలు అనే మరో భర్త దగ్గరికి పోతూంది. అతనితో వ్యభిచరిస్తూంది. హోషేయ ప్రవచనం అంతా యీ భావంతోనే నిండివుంటుంది. అతని ప్రవచనంలో ప్రభువు "ఈ దేశప్రజలు నన్ను విడనాడి వ్యభిచారిణిలా ప్రవర్తిస్తున్నారు" అంటాడు - 12. అతడు యిస్రాయేలు అనే వధువు నుద్దేశించి

"ఆమె నేను నా ప్రేమికుల వద్దకు వెళ్తాను

వారు నాకు అన్నపానీయాలు ఉన్ని నార

ఓలివు తైలం ద్రాక్షసారాయం ఇస్తారు

అని పల్కుతుంది" అంటాడు - 2,7.

ఈ వ్యభిచార భావాన్ని విపులంగా వర్ణించిన ప్రవక్త యెహెజ్కేలు, యిస్రాయేలు దేశం సమరియు యూదా అని రెండు రాష్ట్రాలుగా వుండేది. ప్రవక్త ఈ రెండు రాజ్యాలను