పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పకొన్నారు - మత్త21,10. యూదా సైనికులతో అతన్ని బంధించడానికి వచ్చినపుడు క్రీస్తు మిూరు ఎవరిని వెతుకుతున్నారని అడిగాడు. వాళ్లు నజరేయుడైన యేసుని అని సమాధానం చెప్పారు. ప్రభువు నేనే అతన్ని అని పల్మాడు. ఆ మాటలు చెప్పగానే ఆ సైనికులు వెనుకకు తగ్గి నేలమిద పడిపోయారు - యోహా 18,3-6. పూర్వం కీర్తనకారుడు "నేను నీకు ప్రార్థన చేయగానే నా శత్రువులు వెనక్కుతిరిగి పారిపోతారు" అని జపించాడు - 56,9.

శిష్యులు క్రీస్తుతో "ప్రభూ! నీ పేరిట పిశాచాలు కూడ మాకు లోబడ్డాయి" అని చెప్పారు - లూకా 10,17. శిష్యులు కానివాళ్ళ కూడ యేసు అనే దివ్యనామ బలాన్ని వినియోగించుకొన్నారు. కనుకనే యోహాను క్రీస్తుతో "బోధకుడా! మనలను అనుసరింపని వాడొకడు నీ పేరిట దయ్యాలను పారదోలుతుంటే చూచి మేము వానిని నిషేధించాం" అన్నాడు - మార్కు9,38. “మిరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినా ఆయన విూకు అనుగ్రహిస్తాడు" అని క్రీస్తే స్వయంగా శిష్యులతో చెప్పాడు - యోహా 16,23.

5. యేసు చనిపోయాక అతని నామ ప్రభావం

యేసు బ్రతికివుండగానే అతని పేరు శక్తితో నిండివుండేది. అతడు చనిపోయాక ఆ పేరు ప్రభావం ఇంకా యొక్కువైంది. యెరూషలేం దేవాలయం గుమ్మం దగ్గరకుంటివాడు పేత్రుని భిక్షమడిగాడు. అతడు వెండిబంగారాలేవీ నా దగ్గరలేవు. నాకు ఉన్నదానిని నీకిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట నీవు నడువు అని చెప్పాడు - అ,చ,3-6. తర్వాత పేత్రు దేవళంలో ప్రసంగిస్తూ "ఆ యేసు నామమే ఈ కుంటివానికి బలమిచ్చింది" అని చెప్పాడు -3,16. పిమ్మట అతడు యూదుల విచారణ సభ యెదుట కూడ మాట్లాడుతూ "నజరేయుడైన యేసుక్రీస్తు నామం వల్లనే ఈ కుంటివానికి ఆరోగ్యం కలిగింది" అని వాకొన్నాడు - 4,10. ఆ దివ్యనామ ప్రభావం అలాంటిది. పూర్వం కీర్తనకారుడు "ప్రభూ! నీ పేరుతో నన్ను రక్షించు" అని ప్రార్ధించాడు - 541. పేత్రూ ఇతర శిష్యులూ తండ్రికి ప్రార్థన చేస్తూ "దేవా! నీ పావన సేవకుడైన యేసు పేరిట అద్భుతాలనూ ఆశ్చర్య కార్యాలనూ చేయి అని జపించారు - అ,చ,4-80. కాని యేసుని నమ్మితేనే అతని నామం పనిచేసేది. పైన పేర్కొన్నకుంటివాడు ప్రభుని నమ్మాడు, కనుక అతని కాలు నయమైంది – 3,16, యూదుల ప్రధానార్చకుడైన స్కెవ అనే వాని కుమారులు "పౌలు బోధిస్తున్న యేసు పేరిట నిన్ను వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం" అంటూ ఓ దయ్యాన్ని వెళ్ళగొట్టబోయారు. కాని వారికి యేసునందు విశ్వాసం లేదు. కనుక ఆ దేయ్యం యేసునీ పౌలునీ నేనెరుగుదును. కాని విూరెవరు?" అంటూ వారిమిూద తిరగబడింది. కనుక భక్తివిశ్వాసాలు లేనిచోట యేసు నామం పనిచేయదు - 19,13-16.