పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తునందు విశ్వాసం గలవాళ్ళ కనుక పేత్రు పౌలు ప్రభువు పేరు మిూదుగా అద్భుతాలు చేసారు. పేత్రు లిద్దా అనే వూరిలో ఎన్మిదేండ్ల నుండి పక్షవాతంతో బాధపడుతూన్న ఐనెయ అనే అతన్ని చూచి "యేసుక్రీస్తు నిన్ను బాగుచేసాడు. నీవు లేచి నీ పడక నెత్తుకొనిపో" అనగానే అతడు లేచాడు - అ,చ.9,34. పౌలు ఫిలిప్పిలో భూతావేశురాలై సోదెచెప్పే బాలికను జూచి "యేసుక్రీస్తు నామాన నీవు ఈమె నుండి వెడలిపో" అని చెప్పగానే దయ్యం ఆమెనుండి వెళ్ళిపోయింది - 16,18.

ప్రజలు యేసుక్రీస్తునామాన పాపపరిహారం పొంది జ్ఞానస్నానాన్నిస్వీకరించాలి -2,38. యేసు అనే నామం విూదిగానేగాని మనకు రక్షణం లేదు - 4,12. సంగ్రహంగా చెప్పాలంటే, తొలినాటి క్రైస్తవులు "యేసుక్రీస్తు ప్రభువు" అని విశ్వసించారు - ఫిలి 2,11. ఇక్కడ ప్రభువు అంటే దేవుడు. పూర్వవేదంలో ప్రభువు నామం తండ్రికి చెల్లుతుంది. నూత్నవేదంలో ఈ నామం క్రీస్తుకి చెందుతుంది. అనగా తండ్రి యెంతటివాడో అతని కుమారుడైన క్రీస్తు కూడ అంతటివాడని బావం.

ప్రార్థనా భావాలు

1. మనది ల్యాటిన్ శ్రీసభ. గ్రీకు శ్రీసభకు చెందిన క్రైస్తవులు "ప్రభువైన యేసూ! పాపినైన నామిూద దయగా వుండు" అనే మంత్రాన్ని సుకృతజపంగా వాడుకొంటారు. ఈ వాక్యాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో జోడించి నిదానంగా జపిస్తాం, దీనికే "యేసునామజపం" అని పేరు. ఈ ప్రార్ధనం మనం కూడ జపించదగ్గది. మన దేశంలో నామజపం అనే సంప్రదాయం వుంది. అనగా భగవంతుని నామాన్ని భక్తితో జపించడం. యేసు నామాన్నిగూడ నామ జపంగా వాడుకోవచ్చు ఆ నామాన్ని భక్తితో ఉచ్చరించడమే గొప్ప జపం. ఇంకా మనం "యేసూ! నీవు నాకు యేసువుగానుండు" అని చెప్పకోవచ్చు. అనగా అతడు మనకు రక్షకుడుగా వుండాలని భావం. హెబ్రేయుల జాబు చెప్పినట్లు "యేసుక్రీస్తు నిన్న నేడు, ఎల్లప్పడు ఒకేరీతిగా వుంటాడు" - 13,8. అతడు ఎల్లవేళలా రక్షకుడే.

2. యేసు అంటే రక్షకుడు అన్ని చెప్పాం, అతనిద్వారా తండ్రి మనకు కట్టకడపటి రక్షణాన్ని దయచేస్తాడు. తండ్రి పూర్వవేదంలో చాలసార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, నూతవేదంలో ఈ క్రీస్తు ద్వారా కట్టకడపటి సారిగా తన సందేశాన్ని మనకు విన్పించాడు. ఆ సందేశాన్ని భక్తితో ఆలించి అంగీకరించేవాళ్ళను క్రీస్తు తప్పక రక్షిస్తాడు - హెబ్రే 1.1-2. అతడు సిమియోను ఎదురుచూచిన యిస్రాయేలీయుల రక్షణం - లూకా 2,25, నేడు మన రక్షణం కూడ.