పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/213

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అనగా యావే ఈ వ్యక్తి ద్వారా ప్రజలను రక్షిస్తాడు అని భావం. ఈ యెహోషువా పదమే గ్రీకు నూతవేదంలో ఇయేసున్గా మారి, తెలుగులో యేసుగా వ్యవహరింపబడుతూంది.

పూర్వవేదంలో చాలమందికి యెహోషువా పేరుంది. మోషే అనుచరుడైన యోషువా పేరు ఇదే. చాలమంది ప్రధాన యాజకులు కూడ ఈ పేరు పెట్టుకొన్నారు. క్రీస్తు తర్వాత కూడ యూదుల్లో చాలమంది ఈ పేరును స్వీకరించారు. పౌలు శిష్యుల్లో ఓ అతని పేరు యేసు యూస్తు - కొలో 4,11. కాని రెండవ శతాబ్దం తర్వాత యూదులు క్రీస్తుపట్ల గల అనాదరభావంచే ఈ పేరును తిరస్కరించారు. క్రైస్తవులు ప్రభువు పట్లగల గౌరవభావంచే ఈ పేరును పెట్టుకోడానికి సాహసింపలేదు.

2. బైబులు ఈ పేరుకి అర్ధంచెప్పే తీరు

దేవదూత యోసేపుతో "నీవు ఆ శిశువుకి యేసు అని పేరు పెట్టు. అతడు ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు" అని చెప్పాడు - మత్త 1,21. యోసేపు అతనికి అలాగే పేరు పెట్టాడు. యేసు అనే పేరుకి "తండ్రి ఈ వ్యక్తిద్వారా ప్రజలను రక్షిస్తాడు" అని అర్థం చెప్పాం గదా. క్రీస్తు శిశువుకి సున్నతి చేసినపుడు యేసు అని పేరు పెట్టారు అని చెప్తుంది లూకా సువిశేషం - 221. అతడు యూదుల బిడ్డడు. అతని పేరుకూడ యూదుల పేరే. యూదుల సంప్రదాయం ప్రకారం తండ్రే కుమారునికి పేరు పెడతాడు. ఉదాహరణకు జకరియ తన కుమారునికి యోహాను అని పేరు పెట్టాడు - లూకా 1,63. అలాగే యోసేపు కూడ తన కుమారునికి యేసు అని నామకరణం చేసాడు.ఈ శిశువు తన ప్రజలను రోమీయుల క్రూర పరిపాలనం నుండి రక్షింపడు, పాపం నుండి రక్షిస్తాడు. అతని పేరు ప్రధానంగా ఈ రక్షణాన్ని సూచిస్తుంది.

3. చారిత్రకంగా యేసు అనే వ్యక్తి

యేసు రక్తమాంసాలతో గూడిన నిజమైన నరుడు. చారిత్రకంగా ఈ మంటివిూద నడచినవాడు, అతడు రోమను ప్రభువైన అగస్తు చక్రవర్తికాలంలో, కురేనియా సిరియాకు మండలాధిపతిగా వున్న రోజుల్లో, బేల్లెహేమలో జన్మించాడు - లూకా 2,1-2 అతనికి నజరేతూరి యేసు అని పేరుండెడిది - మార్కు 1,24, గలిలయుడైన యేసు అని కూడ పేరుండెడిది - మార్కు 6,3. పేత్రు యూదులకు అతన్ని గూర్చి బోధిస్తూ "మిూరు సిలువపై చంపిన ఈ యేసు” అని అంటాడు - అచ 2,36, కావున యేసు చారిత్రక వ్యక్తి గాని ఊహామాత్రపు నరుడు కాదు.

4 యేసు బ్రతికివుండగా అతని నామ ప్రభావం

యేసు యెరూషలేము ప్రవేశించినపుడు నగరంలో కలకలం పట్టింది. ప్రజలు "ఇతరు ఎవరు? గలిలయలోని నజరేతు అనే వూరి ప్రవక్తమైన యేసు కాడా?" అని