పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/206

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రార్థనా భావాలు

1. దేవుడు నమ్మదగినవాడు కనుక మనకు పునాది రాయి ఔతాడు. మనం అతని విూదనే ఆధారపడాలి. “ఈ బాలుడు యిస్రాయేలీయుల్లో అనేకుల పతనానికీ ఈ ఉద్ధరణకూ కారకుడౌతాడు" - లూకా 2,34 "యేసుక్రీస్తు అనే దేవుడు వేసిన పునాదిని తప్ప వేరొక పునాదిని ఎవడూ వేయలేడు” - 1కొరి 3,11. ఈ క్రీస్తుని నిండు హృదయంతో నమ్మి మనం రక్షణం పొందాలి.

2. క్రీస్తు హృదయం నుండి నీళ్లూ నెత్తురూ స్రవించాయి. ఆ నెత్తురు దివ్యసత్రసాదాన్నీ ఆ నీళ్ళ జ్ఞానస్నానాన్నీ సూచిస్తాయని చెప్పాం. కనుక అతడు మనకెప్పడూ రక్షణ శిలగానే వుంటాడు.

3. పేత్రు మొదటిజాబు వాకొన్నట్లు క్రీస్తూ మనమూ కలసి ఒక్క దేవాలయంగా నిర్మింపబడతాం, అతనితో కలసి మనం పితను ఆరాధిస్తాం. కనుక మనం ఆరాధన సమాజానివి,

10. రక్షకుడు

రక్షకుడు అనేది క్రీస్తు ప్రధాన నామాల్లో ఒకటి. ఈ యధ్యాయంలో అతడు మనకు ఏలా రక్షకుడౌతాడో చూద్దాం.

1. శత్రువుల నుండి రక్షణం

నరుడు దుర్భల ప్రాణి. అంటురోగాలు, యుద్ధం, కరువు, మృత్యువు మొదలైనవాటి నుండి అతనికి రక్షణం అవసరం. పూర్వవేద ప్రజలు యావే ప్రభువుకి మొరపెట్టుకొంటే ప్రభువే వారిని కాపాడేవాడు. పూర్వవేదంలో రక్షణం ప్రధానంగా బైతికమైంది గాని ఆధ్యాత్మికమైంది కాదు.

పూర్వవేదప రక్షణలన్నిటిలోను పెద్దది, యిస్రాయేలీయులను ఫరో చక్రవర్తి బానిసం నుండి విడిపించడం, కనుకనే ప్రభువు మోషేతో "నేను ఐగుప్న దేశీయులు విూ నెత్తికెత్తిన బరువును తొలగిస్తాను. వారి దాస్యం నుండి మియాకు విముక్తి కలిగిస్తాను. శక్తిగల నా చేతిని చాచి, విూ శత్రువులను నిశితంగా శిక్షించి మిమ్మ దాస్యంనుండి విడిపిస్తాను" అని చెప్పాడు - నిర్గ 6,6, యావే తప్ప రక్షించేవాడెవడూ లేడని యిస్రాయేలీయుల నమ్మకం – యెష 43,11.

2. భావికాలంలో రాబోయే రక్షకుడు

యావే ప్రభువు భావికాలంలో ఒక గొప్ప రక్షకుడు వచ్చి ప్రజలను ఉద్ధరిస్తాడని వాగ్గానం చేసాడు. అప్పడు యిస్రాయేలీయులు బాబిలోనియా ప్రవాసంలో బాధలనుభ