పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విస్తున్నారు. ప్రభువు దావీదు వంశం నుండి రాబోయే మెస్సీయా ద్వారా ప్రజలకు రక్షణం కలుగుతుందని చెప్పాడు. ఆ మెస్సీయా ప్రజలకు కాపరి ఔతాడని వాగ్దానం చేసాడు. "నా సేవకుడైన దావీదుని నా మందకు ఒకేదొక కాపరినిగా నియమిస్తాను. అతడు వాటిని పోషిస్తాడు. నా సేవకుడైన దావీదు వాటికి పాలకుడౌతాడు” అని నుడివాడు - యెహెజ్నేలు 34,22-24. ఈ దావీదు మెస్సీయాయే.

ఈ రక్షణం వలన ప్రజలకు పాపపరిహారమూ, నూత్నాత్మా నూత్న హృదయమూ లభిస్తాయి. ప్రభువు ఈలా పలికాడు. "నేను మిపై శుభ్రమైన జలాలను చల్లి మిమ్మశుద్ధిచేస్తాను. మిూకు నూత్న హృదయాన్ని దయచేస్తాను. నూత్నాత్మను మిూలో వుంచుతాను. మినుండి రాతిగుండెను తొలగించి విూకు మాంసపు గుండెను దయచేస్తాను. నా యాత్మను మిూలోవుంచి విూరు నా చట్టాలను అనుసరించేలాను, నా విధులను పాటించేలాను చేస్తాను” - యేపెూ 36,25-28. ఈ రక్షణం అన్ని జాతులకూ లభిస్తుంది.

"ఎల్లజాతులూ చూస్తుండగా

ప్రభువు తన దివ్యశక్తిని ప్రదర్శిస్తాడు

భూమియెల్ల మన దేవుని రక్షణాన్ని చూస్తుంది"

- యెష52, 10, ప్రజల తరపున ప్రజల ఈ రక్షణానికై వేయి కండ్లతో ఎదురు చూచారు.

"ఆకాశమా! పైనుండి విజయాన్ని వర్షించు

భూమి విచ్చుకొని ఆ విజయాన్ని స్వీకరించి

రక్షణాన్ని మొలకెత్తించుగాక,

విమోచననాన్ని అంకురింపజేయునుగాక".

ఆరోజుల్లో కొందరు భక్తులు కుమ్రాను ఎడారిసీమల్లో వసిస్తూండేవాళ్ళు వాళ్ళూ, గ్రీకు రోమను భక్తులు కూడ ఆ రక్షకునికై గంపెడాశతో ఎదురుచూచారు.

3. రక్షకుడు క్రీస్తే

పై భక్తుల కోర్కెలన్నీ క్రీస్తునందు నెరవేరాయి. అతని పేరు యేసు, కాని యిది తెలుగుమాట. హీబ్రూ భాషలో అతని పేరు యెహోషువా, అనగా తండ్రి రక్షణాన్ని కొనివచ్చేవాడు. తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించేవాడు - మత్త 121. "ప్రభువు తన సేవకుడైన దావీదు వంశాన మన కొరకు శక్తిసంపన్నుడైన రక్షకుణ్ణి ఏర్పరచాడు" అంటూ జకరియా అతని ఆగమనాన్ని సూచించాడు — లూకా 1,69, "ప్రజలందరి యెదుట నీవు ఏర్పరచిన రక్షణాన్ని నేను కనులారా చూచాను" అంటూ సిమియోను అతని రాకడను స్తుతించాడు - లూకా 2,30.