పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/205

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

"నా పావిత్ర్యం వలన నేను

ప్రజలు తట్టుకొని పడిపోయే

రాయీవంటివాడ నెతాను?

అంటాడు - 8-14. యూదా యిప్రాయేలు ప్రజలుకూడ యావే అనే రాతిని తట్టుకొని పడిపోతారు. అనగా వాళ్ళ అతన్ని నమ్మనందున అతని నుండి శిక్షను కొనితెచ్చుకొంటారు. నూత్నవేదంలో పౌలు యీ అడ్డురాయి క్రీస్తేనన్నాడు - రోమా 9,33. లూకా కూడా క్రీస్తుని యిూ వినాశ శిలతో పోల్చాడు. "ఎవడు ఈ రాతిమిూద పడతాడో వాడు తునాతునకలౌతాడు. ఎవనిపై యీ రాయి పడుతుందో వాడు నలిగి నుగ్గవుతాడు - 20,18. కనుక యీ వాక్యాల్లో క్రీస్తు మనం తట్టుకొని పడేరాయి, మనమిద పడి మనలను నుగ్గుచేసే రాయి అని చెప్పబడింది. అనగా అతడు మనకు శిక్షకుడు ఔతాడని భావం. ఈలాంటి రాతినొక దానిని దానియేలు ప్రవచనం కూడ పేర్కొంటుంది - 2,34-35,

6. మూలరాయి, సజీవ శిలలు

"ఇల్లు కట్టేవారు పనికిరాదని నిరాకరించిన రాయే మూలరాయి అయింది" అంటుంది కీర్తన 118,22. ఇక్కడ యీ వాక్యం బాబిలోనియా ప్రవాసం నుండి తిరిగివచ్చిన యిస్రాయేలీయులకు వర్తిస్తుంది. బాబిలోనియాలో అవమానాలకు గురైనవాళ్ళే ఇప్పడు పాలస్తీనా దేశంలో గౌరవాన్ని పొందుతున్నారని కీర్తనకారుని భావం, నూత్నవేదంలో క్రీస్తు యీ వాక్యాన్ని తనకే అన్వయించుకొన్నాడు - మత్త21,42. యూదులు నిరాకరించిన క్రీస్తే నూత్న క్రైస్తవ సమాజానికి నాయకుడౌతాడని అతని భావం.

పూర్వవేదంలో ప్రభువు మెస్సీయాను గూర్చి చెప్తు "నేను సియోనున ఒక మూలరాతిని వేస్తున్నాను" అంటాడు- యెష 28,16. ఈ మూలరాయి మెస్పీయాయే. మెస్సీయాను నమ్మే భక్తసమాజం ఈ మూలరాతి విూదనే నిలుస్తుంది. పేత్రు మొదటిజాబు ఈ మూలరాయి క్రీస్తేనని చెప్తుంది-2,4-8. ఈ జాబు భావాల ప్రకారం క్రీస్తనే మూలరాతి మిూద క్రైస్తవులను సజీవ శిలలనుగా పేరుస్తారు. క్రీస్తూ క్రైస్తవ సమాజమూ కలసి ఓ దేవాలయ మౌతుంది, ఈ దేవళంలో యెరూషలేం దేవళంలో వలె జంతు బలులను గాక ఆధ్యాత్మిక బలులను అర్పిస్తారు. అనగా క్రైస్తవ సమాజం క్రీస్తుతో ఏకమై తండ్రికి సిలువబలి నర్పిస్తుందని భావం - 2,5.

ఈలా శిలలను గూర్చి పూర్వ నూత్న వేదాల్లో చాలా భావాలున్నాయి, ఇవి యావే ప్రభువుకీ క్రీస్తకీ వర్తిస్తాయి. ఈ భావాలను భక్తులు నిష్టతో ధ్యానం చేసికోవాలి.