పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/202

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

4.ఆదాము ప్రాత మానవుడు. క్రీస్తు నూత్న మానవుడు. ఈ క్రీస్తు ద్వారా మనం నూత్న మానవులం కావాలి. యూదులవలె మనకు సున్నతి ముఖ్యం గాదు, నూతసృష్టికావడం ముఖ్యం - గల 6,15. మనం ప్రాత మనస్సుని తొలగించుకొని క్రొత్త మనస్సుని అలవర్చుకోవాలి. దేవుడు మనలను తనకు ప్రతిబింబంగా తీర్చిదిద్ది మనలను నూతనరులను చేస్తాడు - కోలో 3,8–10. క్రీస్తు యూదులను అన్యజాతులకు చెందిన మనలను ఏకం చేస్తాడు. అతడు ఈ రెండు జాతుల నుండి తనతో ఐక్యమయ్యే నూత్న జాతిని కలిగిస్తాడు- ఎఫె 2,14. నేడు మనమంతా ఆ నూత్న ఆదాములో మెదులుతూంటాం.

5.ఆదాము గర్వంతో దేవుడంతటివాణ్ణి కావాలనుకొని జ్ఞానవృక్షఫలం ఆరగించాడు. నూత్న ఆదామైన క్రీస్తు వినయంతో నీచమైన సిలువ మరణానికి గూడ సంసిద్దుడయ్యాడు. అతడు ఎల్లప్పడు దైవస్వభావం కలవాడే ఐనా, స్వార్థబుద్ధితో దేవునితో తనకున్న సమానత్వాన్ని పట్టుకొని వ్రేలాడలేదు. తన్ను తాను రిక్తుని చేసికొని సేవకుని రూపంలో నరుడై జన్మించాడు. నేడు ప్రాత స్వభావం, గర్వం వదలుకొని నూత్న స్వభావమూ వినయమూ అలవర్చుకోవడంలో ఈ క్రీస్తు మనకు ఆదర్శం - ఫిలి 2,6.

6.ఆదాముకి వచ్చిన శోధనలు ఎడారిలో నూత్న ఆదాముకి గూడ వచ్చాయి. కాని క్రీస్తు ఈ శోధనలను జయించాడు, అతని విజయం నేడు మనమిూద సోకుతుంది. క్రీస్తు ద్వారా మనం నిరంతరం పిశాచాన్ని జయించి నూత్నత్వాన్ని పొందుతూండాలి — లూకా 4.1-13.

7.ఆదాము దేవుని కుమారుడు - లూకా 8,88. కాని దేవునికి ఆదాముకంటె ప్రీతిపాత్రుడైన కుమారుడు ఇంకొకడున్నాడు. అతడే క్రీస్తు. ఆ క్రీస్తు వరప్రసాదం ద్వారా మనం నిరంతరం క్రొత్త ఆదాములం ఔతూండాలి.

9.శిల

పాలస్తీనా దేశం రాతిమయం. ఎక్కడ చూచినా కొండలూ బండలూ గుట్టలు కన్పిస్తుంటాయి. రాయి గట్టిది, బలమైంది, దీర్ఘకాలం మనేది. కనుక దాన్ని నమ్మవచ్చు o&8 కట్టినయిల్లు, గోడ, కోట నరులకు రక్షణనిస్తుంది. యిస్రాయేలీయులు ఈ రాతి గుణాలన్నీదేవునికి అన్వయింపజేసారు. అతడు రాయిలాగ బలమైనవాడు, నమ్మదగినవాడు, రక్షణనిచ్చేవాడు అన్నారు. బైబులు దేవుణ్ణి రాతితో పోల్చి చెప్పే భావాలు చాలా వున్నాయి. వాటిని క్రమంగా పరిశీలిద్దాం.