పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. ఇద్దరూ ఆదాములూ, క్రైస్తవుడూ

మనం భౌతికంగా తొలి ఆదామునుండి జన్మిస్తాం. ఆధ్యాత్మికంగా రెండవ ఆదామునుండి నూత్న జన్మనొందుతాం. ఇది జ్ఞానస్నానం ద్వారా జరుగుతుంది. తొలి ఆదాము ద్వారా మనలో జీవించేవాడు నూత్న మానవుడు. పౌలు మనలోని ప్రాత స్వభావాన్ని తొలగించి నూత్న స్వభావాన్ని అలవర్చుకోవాలని బోధించాడు - ఎఫె 4,22-24 ప్రాత మనస్సును తొలగించి క్రొత్త మనస్సును పొందాలని చెప్పాడు - కొలో 3,9-10. నూత్న మానవుడైన క్రీస్తు మనలో నెలకొనాలని బోధించాడు. బైబుల్లో ప్రాతతనం పాపానికీ, క్రొత్తదనం పవిత్రతకీ చిహ్నంగా ఉంటాయి.

ప్రార్థనా భావాలు

1. నరునికి మొదట చావలేదు. తన్ను చేసిన దేవుళ్లాగే అతడు కూడ అమరుడు. కాని పిశాచం నరుడ్డి చూచి అసూయ పడి అతనికి మరణాన్ని తెచ్చిపెట్టింది,

“దేవుడు నరుడ్డి అమరునిగా జేసాడు అతనిని తనవలె నిత్యునిగా జేసాడు కాని పిశాచం అసూయ వలన మృత్యువు లోకంలోనికి ప్రవేశించింది" అంటుంది సొలోమోను జ్ఞానగ్రంథం - 2,23-24. ఈ రీతిగా పిశాచం తొలి మానవుణ్ణి జయించింది. కాని నూత్న నరుడైన క్రీస్తు మనకొరకు ఈ పిశాచాన్ని జయించాడు. అతన్ని విశ్వసించినపుడు అతని విజయం మనమిూద సోకుతుంది - యోహా 12,31. క్రీస్తు ద్వారా మనం నిత్యం పిశాచాన్ని జయిస్తుండాలి.

2. మొదట లోకంలో పాపం లేదు “ఆది స్త్రీ నుండే పాపం వచ్చింది ఆమె మూలంగా మనమందరం చనిపోవలసి వచ్చింది"

అంటుంది సీరా జ్ఞాన గ్రంథం - 25,24. కాని నూత్న ఏవ తొలియేవ పాపానికి పరిహారం చేసిపెట్టింది. ఆదాము ఏవలు మన చావుకి కారణమైతే రెండవ ఆదాము క్రీస్తు, రెండవ ఏవ మరియు మన జీవానికి కారకులు.

3. భువినుండి పట్టిన ఆదామును పోలిన మనం, దివినుండి వచ్చిన రెండవ ఆదామని గూడ పోలుతాం - 1కొరి 15,49, జ్ఞానస్నాన సమయం నుండే మనం క్రీస్తుని పోలివుంటాం. ఈ పోలిక మన ఉత్థానంతో పరిపూర్ణమౌతుంది. కనుక మనం నిత్యం మన మనస్సులను పరలోక వస్తువులు మిద నిల్పుకోవాలి - కొలో 3,1. అనగా మనకు లౌకిక జీవితం చాలదు. పరలోక జీవితం కూడ కావాలి.