పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1.పవిత్ర స్థంభాలుగా రాళ్ళ

బైబులు రాతి విగ్రహాలను ఆరాధించవద్దని రూఢిగా చెప్తుంది. చెక్కిన శిలలను ఆరాధన స్తంభాలుగా నెలకొల్పి వాటికి పూజలు చేయవద్దని చెప్తుంది — లేవీ 26,1. ఐనా యిస్రాయేలు ప్రజలు రాళ్ళనూ రాతి స్తంభాలను నెలకొల్పి వాటికి పూజలు చేసారు, అవి దేవుళ్ళనో లేక దేవునిగుళ్ళనోభావించారు. యాకోబు బేతేలువద్ద ఒక శిలను పవిత్ర స్తంభంగా నాటి దాని విూద తైలం పోసాడు. అనగా అది దేవునికీ దేవుని గుడికీ చిహ్నంగా వుంటుంది. అతడు దాన్ని బేతేలు - దేవుని యిల్ల అని పిల్చాడు - ఆది 28,18. మోషే సీనాయి కొండదగ్గర పండ్రెండు తెగల యిప్రాయేలీయుల పేర్లమిదిగా పండ్రెండు రాళ్ళ తీసికొని బలిపీఠం కట్టాడు - నిర్గ 244. రెండు మణుల విూద 12 తెగల పేర్లు చెక్కించి వాటిని ప్రధాన యాజకుని వస్త్రం విూద కుట్టించాడు. ఆ పేర్లను చూచి ప్రభువు యిప్రాయేలీయులను జ్ఞాపకం చేసికొంటాడని చెప్పాడు - నిర్గ 28,10. యేషువా నిబంధనానికి జ్ఞాపకార్థంగా రాళ్ళను పాతించాడు - యోషు 4,5–7. ఈ శిలలన్నీగూడ దైవసాన్నిధ్యాన్ని సూచిస్తాయి. నూతవేదంలో క్రీస్తు అనే శిల మన బలిపీఠమౌతాడు - హెబ్రే 18,10.

2. ఆశ్రయంగా రాయి

రాతితో నిర్మింపబడిన యిల్లు లేక కోట నరులకు ఆశ్రయంగా వుంటుంది. ప్రాచీన మానవులకు కొండ గుహలు కూడ ఆశ్రయాలే. రాయి గట్టిగా వుంటుంది. చాల కాలం నిలుస్తుంది, దాన్ని నమ్మవచ్చు. ఈ భావాలను మనసులో పెట్టుకొని యిస్రాయేలీయులు దేవుణ్ణి నమ్మదగిన వాడు, రక్షణ శిల, కోట, దుర్గం అని పిల్చారు. ఈ సందర్భంలో కీర్తనకారుడు ఈలా అన్నాడు :

"ప్రభువు నాకు శైలము, కోట
నా దేవుడు నన్నాపదనుండి రక్షించేవాడు
నేనతని మరుగు జొత్తును
ఆ ప్రభువు నాకు దుర్గం, డాలు
రక్షణసాధనం, ఆశ్రయ సాధనం" - 18,2.

3. పునాది రాయి

శిల గట్టిగా వుండడం వల్ల పునాదిరాయిగా ఉపయోగపడుతుంది. "నేను సియోనున ఒక పునాదిరాయి వేస్తున్నాను ఆ మూలరాయి విలువ కలది, పటిష్టమైనది విశ్వాసం కలవాడు చలింపడు? అంటాడు యెషయా - 28,16. ఇక్కడ పునాదిరాయి మెస్సీయాయే. యూదా యిస్రాయేలు పౌరులంతా ఈ మెస్సీయా అనే మూలరాతి విూద నిలబడవలసిందే. అతన్ని నమ్మవలసిందే.