పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నరుడు కేవలం ఆహారం వలననే జీవింపడు
దేవుడు వచించే ప్రతి వాక్కు వలనా జీవిస్తాడు"
అని చెప్పాడు - మత్త 4,4.

మార్కు సువార్త 6వ అధ్యాయంలో క్రీస్తు ఐదువేల మందికి ఆహారం పెట్టిన అద్భుతం వస్తుంది. ఈ సందర్భంలో క్రీస్తు మొదట ప్రజలకు బోధ చేసాడు. కాపరిలేని మందలా వున్న జనాన్ని చూచి జాలిగొని వారికి అనేక విషయాలు బోధించాడు - 6,34 ఆ పిమ్మట ఐదు రొట్టెలను రెండు చేపలను త్రుంచి ఐదువేల మందికి పంచిపెట్టాడు6,41-42. కనుక ఈ యద్భుతంలో రొట్టె అంటే మొదట దేవుని వాక్కే అటుపిమ్మట అది మాములు భోజనాన్నీ క్రీస్తు మనకీయబోయే స్వీయదేహాన్ని గూడ సూచిస్తుంది.

ఇక యోహాను 6,35లో ప్రభువు “జీవాహారాన్ని నేనే. నా వద్దకు వచ్చేవాడు ఎన్నటికి ఆకలిగొనడు. నన్ను విశ్వసించేవాడు ఎన్నటికి దప్పికగొనడు" అని చెప్పాడు, ఈ వాక్యాల్లో క్రీస్తు మన్నాకంటె శ్రేష్టమైన భోజనం అనే భావం వుంది. అతని వాక్యాన్ని మనం భక్తితో విశ్వసించాలనే భావమూ వుంది. అనగా అతడు భుజింపదగిన ఆహారమూ, విశ్వసింపదగిన వాక్కూ అని గూడ అర్థం. ఈ యధ్యాయం 35-50 వచనాలకు సర్వత్ర భోజనం, వాక్కుపట్ల విశ్వాసం అని రెండర్గాలు చెప్పవచ్చు. ఫలితార్థమేమిటంటే క్రీస్తు మనకు ఆహారమూ, దైవవాక్కుగూడ.

ప్రార్ధనా భావాలు

1. "మీరు మనుష్య కుమారుని శరీరాన్ని భుజించి అతని రక్తాన్ని త్రాగితేనే తప్ప మీలో జీవముండదు” యోహా 6,53. భౌతికమైన భోజనం మన శరీరానికి పుష్టినిచ్చినట్లే దివ్యసత్ర్పసాదం మన ఆత్మకు బలాన్నిస్తుంది. కనుక మనం ఈ యమృతాహారాన్ని పలుసారులు, వీలయితే ప్రతిరోజు, భక్తితో భుజించాలి.

2. "డిడాకే" అనే ఓ ప్రాచీన క్రైస్తవ ఆరాధన గ్రంథం ఈలా వాకొంటుంది."ఓ ప్రభూ! ఈ పూజలో మేము విరిచే రొట్టె మొదట కొండల్లో పండిన గోదుమ గింజలు. వాటినన్నిటినీ ఏకంచేసి ఇక్కడ ఒక్క రొట్టెగా తయారుచేసాం. ఇక్కడ మేము పానం చేసే ద్రాక్షసారాయం గూడ చాల పండ్ల నుండి తీసినరసం, ఈ పదార్థాలను లాగే శ్రీసభలోని నీ ప్రజలను గూడ లోకం నాల్లచెరగుల నుండి చేరదీసి ఇక్కడ ఒక్కసమాజంగా ఐక్యం చేయి." ఇది చాల అర్థవంతమైన ప్రార్ధనం. చాల గోదుమ గింజలు కూడి ఒక్క అప్పమూ, చాల ద్రాక్షపండ్లు కలసి చేరెడు