పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంపగా వచ్చిన క్రీస్తు ఆ తండ్రినుండి జీవం పొందినట్లే, క్రీస్తుని భుజించే భక్తుడు కూడ ఆ క్రీస్తు నుండి జీవం పొందుతాడు. ఒకే జీవవాహిని తండ్రి నుండి క్రీస్తనీ క్రీస్తునుండి భక్తుణ్ణి చేరుతుంది. ఈ జీవవాహిని ప్రవిత్రాత్మే

పై వాక్యాల్లో యోహాను క్రీస్తు శరీరాన్ని ఓ పవిత్రమైన విందుగా భావించాడు. అది మనకు జీవాన్నిచ్చే విందు. దాని ద్వారా మనం ఉత్థానక్రీస్తు దివ్యజీవనాన్ని పొంది అతనితో ఐక్యమౌతాం, ప్రభువు దివ్యశరీరాన్ని ఆరాధనంలో భుజించడంలో ఈ భావాలన్నీ గర్భితమై వున్నాయి.

3. ఆహారంగా దైవవాక్కు

ఇంతవరకు మామూలు రొట్టె లేక ఆహారం, పవిత్రమైన రొట్టె లేక క్రీస్తు శరీరం మనకు ఆహారమౌతాయనే భావాలు చూచాం. కాని బైబులు భావాల ప్రకారం దైవవాక్యం గూడ ఆహారమే. కనుక ఈ యంశాన్ని విపులంగా పరిశీలిద్దాం.

11. దైవవాక్యాన్ని గూడ భోజనంగా స్వీకరించాలి

కూటికి నీటికీ గాదు, ప్రభువు వాక్మకే కరువు వస్తుంది అన్నాడు ఆమోసు ప్రవక్త - 8,11. ఇక్కడ ప్రవక్త వాక్యాన్ని ఆహారంతో పోల్చాడు. అలాగే యెషయా కూడ ప్రభువు నోటినుండి వెలువడే వాక్యాన్ని తిండితో ఉపమించాడు - 55, 10-11. ఇంకా, జ్ఞానగ్రంథాల భావాల ప్రకారం, విజ్ఞాన బోధ వినడం భోజనం చేయడంతో సమానం, విజ్ఞానమనే స్త్రీమూర్తి వివేకహీనుడైనర నరునికి కబురు పంపి

"నీవు నేను తయారుచేసిన భోజనాన్ని ఆరగించు
నేను సిద్ధం చేసిన ద్రాక్షాసవాన్ని సేవించు"
అని చెప్పించింది - సామె 9,5. ఇక్కడ నరుడు ఆరగించే అన్నం విజ్ఞానమే. ఈలాగే సీరా గ్రంథంలో కూడ విజ్ఞానం నరులు నాహ్వానించి
“నన్నభిలషించేవాళ్ళంతా నా చెంతకు రండి
మీ యాకలిదీర నా ఫలాలను భుజించండి
నన్ను భుజించేవాళ్ళ
ఇంకా అధికంగా భుజింపగోరుతారు
నన్నుపానం జేసినవాళ్ళ
ఇంకా అధికంగా పానం జేయగోరుతారు"
అంటుంది - 24, 19–22. ఈ వాక్యాల ప్రకారం విజ్ఞాన వాక్కులు భోజనమే. క్రీస్తుకూడ తన బోధల్లో ఈ భావాన్ని సూచిస్తూ