పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ రొట్టెలు పలిపిడి ద్రవ్యం కలవనివి. పలియజేసే పదార్థం పాపానికి అపవిత్రతకీ చిహ్నం. కనుక ఆరాధనలో పులిపిడి పదార్ధం కలిపన రొట్టెలను వాడేవాళ్ళ కాదు - 1కొ5,7-8. యూదులు పాస్కపండుగ మొదలైన తిరునాళ్ళల్లో పొంగని రొట్టెలే తినేవాళ్లు.

8. రొట్టె శ్రమలకు కూడ చిహ్నం

యిస్రాయేలీయులకు రొట్టె ప్రధానాహారం. ధాన్యాన్ని నలగగొట్టి పిండిచేసి రొట్టెను తయారుచేసేవాళ్లు, భుజించేపడు దాన్ని నమలి తినాలి. ఈలా రొట్టెలో నలిగిపోవడం అనే గుణం వుండడంచేత అది శ్రమలకు చిహ్నమైంది. కనుకనే క్రీస్తు "గోదుమగింజ భూమిలో పడి నశించినంత వరకు ఒంటిగానే వుంటుంది. కాని నశించిన పిదప అది విస్తారంగా ఫలిస్తుంది" అని చెప్పాడు - యోహా 12,24. ఈ వాక్యంలో క్రీస్తు శ్రమలనుభవిస్తాడు అనే భావం ఇమిడి వుంది.

9. కడపటి విందులోని రొట్టె

క్రీస్తు కడపటి విందులో వినియోగించింది ఈ రొట్టెనే. అతడు నా జ్ఞాపకార్థంగా దీన్ని మీ యారాధనంలో వినియోగించుకోండి అని చెప్పింది గూడ ఈ రొట్టెన్లు గూర్చే ఆ కడపటి విందులోలాగే నేటి మన యారాధనంలో గూడ ఈ రొట్టె క్రీస్తు శరీరంగా మారిపోతుంది - 1కొ 11,23-24. ఈ రొట్టె క్రీస్తు శిష్యుల కుండవలసిన ఐక్యతకూ సోదర ప్రేమకూ చిహ్నం. మనమంతా ఒకే రొట్టెలో పాలుపంచుకొంటాం. కనుక మనం అనేకులమైనా గూడ ఆ వొకే రొట్టె ద్వారా ఒకే శరీరమౌతాం - 1కొ 10,17. ఐనా రోజువారి జీవితంలో మనం ఈ సోదరప్రేమను ప్రదర్శించలేక పోతున్నామంటే అది కేవలం మన బలహీనతే.

10. క్రీస్తు జీవాహారం

ఈ సందర్భంలో యోహాను 6వ అధ్యాయాన్ని గూడ జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఈ యధ్యాయం క్రీస్తు శరీరం మనకు ముఖ్యాహారమని చెప్తుంది. క్రీస్తు మనకు జీవాహారం - 6,85. ఈ భోజనం మన్నాకంటె మెరుగైంది. పూర్వం మన్నాతిన్నపితరులు చనిపోయారు. కాని ఈ జీవాహారాన్ని భక్షించేవాడు చనిపోడు - 6,49-50, క్రీస్తు శరీరాన్ని భుజించి అతని రక్తాన్ని పానం జేసేవాడు నిత్యజీవాన్ని పొందుతాడు - 6,53. ఈ భోజనాన్ని ఆరగించేవాడు క్రీస్తులోను, క్రీస్తు అతనిలోను నెలకొంటారు - 6,56. ఇది ఉత్థానాన్ని గూడ ప్రసాదిస్తుంది 6,54, కాని ఇక్కడ అన్నిటికంటె ముఖ్యమైన వాక్యం 6,57. తండ్రి