పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/190

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రసమూ ఔతాయి. అలాగే చాలమంది ప్రజలు కలసి ఒక్క శ్రీసభ ఔతారు. దివ్యసత్రసాదమే మనకు ఈ యైక్యతా భావాన్ని ప్రసాదిస్తుంది . 8. మనం పూజలో పాల్గొని దివ్యసత్ర్పసాదాన్ని భుజిస్తేనే చాలదు, సత్ప్రసదం భుజించకముందు క్రీస్తు వాక్యాన్ని గూడ భుజించాలి. అనగా మనం మొదట కొంతసేపు దైవవాక్యాన్నిధ్యానం చేసికొని అటుపిమ్మట దివ్య సత్ప్రసద విందులో పాల్గొనాలి. క్రీస్తు మనకు ఆహారమూ వాక్కూ రెండూనని చెప్పాం.

4. గోదుమరొట్టె శ్రమలకు చిహ్నంగా వుంటుందన్నాం. రెండవ శతాబ్దంలో అంటియోకయ ఇన్యాసివారు అనే బిషప్పగారిని వేదహింసకులు రోములో సింహాలకు మేతగా అర్పించారు. ఈ సందర్భంలో ఆ పునీతుడు చేసిన ప్రార్ధన యిది. "నేను ప్రభువుకొరకు ఉద్దేశింపబడిన గోదుమ ధాన్యాన్ని వన్యమృగాల కోరల్లో పిండిపిండిగా నలగినపిదప క్రీస్తుకి అర్పింపబడే అప్పంగా మారిపోతాను". తాను ప్రధానంగా దివ్యసత్రసాద బలినర్పించే యాజకుజ్ఞనీ కనుక తనకు శ్రమలు తప్పవనీ ఈ యిన్యాసివారి భావం. మనం కూడ ఈ సత్యాన్ని విస్మరించకుండా వుంటే బాగుంటుంది.

5. పౌలు కొరింతులోని క్రైస్తవులను హెచ్చరిస్తూ అయోగ్యంగా ప్రభువు రొట్టెను తిని అతని పాత్రంలోని రసం త్రాగేవాడు అతని శరీర రకాలకు ద్రోహంగా పాపం చేస్తాడు. కనుక నరుడు మొదట ఆత్మపరిశీలనం చేసికొని ఆ పిమ్మట ఈ పవిత్ర వస్తువులను స్వీకరించాలి. లేకపోతే అతడు తీర్పునకు గురౌతాడు అని చెప్పాడు - 1కొ 11,27-32. ఇవి ఖండితమైన వాక్యాలు. ఈ వేదవాక్యాలు సందర్భాన్ని బట్టి ఇక్కడ పౌలు ఉద్దేశించిన "అయోగ్యత" సోదర ప్రేమ లేకపోవడమే. కనుక సత్రసాద స్వీకరణ సందర్భంలో ఆయా పాపాలను, విశేషంగా సోదర ప్రేమకు వ్యతిరేకమైన పాపాలను, తలంచుకొని పశ్చాత్తాపపడాలి. అవసరమనుకొంటే పాపసంకీర్తనం కూడ చేయాలి. నిర్మల హృదయంతో గాని ఆ ప్రభువుని స్వీకరించగూడదు.


7,నేనే మార్గాని

ప్రాచీన కాలంలో యిస్రాయేలు ప్రజలు స్థిరనివాసం లేకుండా తావునుండి తానకి కదలిపోతుండేవాళ్ళ ప్రయాణం వాళ్ళకు నిత్యకృత్యంగా వుండేది. కావున వాళ్ళ భాషలో మార్గం అనేది ఓ ముఖ్య భావమూ, ఓ ప్రముఖ పదమూ ఐంది. ఈ పదం వాళ్ళ