పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/179

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభువు తేజస్సు మన చీకట్లనూ ఇక్కట్టలనూ తొలగించి మనకు రక్షణాన్ని దయచేస్తుంది. కనుకనే భక్తుడు

"ప్రభూ! నీవు నాకు దీపం వెలిగిస్తావు
నా త్రోవలోని చీకటిని తొలగిస్తావు"

అని వాకొన్నాడు - 18,28. ఈ సందర్భంలో మీకా ప్రవక్త"మనమిపుడు చీకట్లో వున్నా ప్రభువు మనకు వెలుగును దయచేస్తాడు. మనమతని రక్షణాన్ని పొందితీరుతాం” అని నుడివాడు - 7,8-9. ప్రభువు అనుగ్రహాన్ని పొందినవాళ్ళకు

“చీకట్లో గూడ వెలుగు ప్రకాశిస్తుంది
వాళ్ళ చుటూగా వున్న అంధకారం
మట్టమధ్యాహ్నపు వెలురుగా మారిపోతుంది?

యెష 58,19, ఈ పట్టన సామెతల గ్రంథం కూడ

“సత్పురుషుల మార్గం వెలుగు
దాని ప్రకాశం పట్టపగలు వరకు
క్రమంగా వృద్ధిచెందుతుంది"

అని చెప్పంది - 4,18.

4. మెస్సీయా వెలుగు

"చీకటిలో నడచే జనులు పెద్ద వెలుగును చూచారు" అన్నాడు యెషయా - 9,2. ఏమిటి ఈ వెలుగు? మెస్పీయాయే. ఇంకా ఈ ప్రవక్త యెరూషలేమును గూర్చి చెపూ

నీకిక పగలు సూర్యుని వెలుగక్కరలేదు
రేయి చంద్రుని వెన్నెల యక్కరలేదు
ప్రభువునైన నేను నీకు శాశ్వతజ్యోతి నౌతాను
నీ దేవుడనైన నేను నీకు తేజస్సు నౌతాను"

అని పల్మాడు 60,19. మెస్సీయా ద్వారానే ప్రభువు తనర ప్రజలకు శాశ్వతజ్యోతి ఔతాడు. యెషయా ప్రవచనంలో బాధామయ సేవకుడు అనే వ్యక్తి తగులుతాడు. ఇతడు నూత్నవేదంలో రాబోయే క్రీస్తుకి ప్రతీకగా వుంటాడు. దేవుడు ఈ సేవకునితో "నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమిస్తున్నాను" అని చెప్పాడు –49,6. ఈ వాక్యాలన్నీగూడ నూతవేదంలో రాబోయే మెస్సీయా వెలుగు అని సూచిస్తాయి.