పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. క్రీస్తు వెలుగుగా అవతరించాడు

పై పూర్వవేద ప్రవచనాలన్నీనెరవేరి నూత్న వేదంలో క్రీస్తు వెలుగుగా జన్మించాడు. "చీకటిలో నడిచే ప్రజలు పెద్ద వెలుగుని చూచారు" అనే పై యెషయా ప్రవచనాన్ని క్రీస్తుకి అన్వయించాడు మత్తయి - 4,16. ఇంకా స్నాప్రక యోహాను జన్మించినపుడు జకరియా తన ప్రవచన గీతంలో "దయార్ధ హృదయుడైన దేవుడు తన రక్షణపు వెలుగుని మనపై ప్రసరింపజేసాడు" అని నుడివాడు - లూకా 1,78. ఈ రక్షణపు వెలుగు క్రీస్తే. ఈ విధంగా క్రీస్తు ప్రకాశమూర్తిగా అవతరించాడు.

6. క్రీస్తు దివ్యరూపధారణం వెలుగు

క్రీస్తు తబోరుకొండమీద దివ్యరూపం ధరించాడు. అతని ముఖం సూర్యునివలె ప్రకాశించింది. వస్తాలు వెలుగు లాగ తెల్లనయ్యాయి - మత్త 17,2. అప్పుడు దేవుని తేజస్సు క్రీస్తు ముఖంలో ప్రకాశించిందో అన్నట్లు చూపట్టింది. వెలుగుకి ఆధారభూతుడూ, ఎవరూ చేరలేని దివ్యతేజస్సులో వసించేవాడూ ఐన తండ్రి, ఈ క్రీస్తుద్వారా మనమధ్య ప్రత్యక్షమయ్యాడు - 1తిమో 6,16. అసలు దేవుడు చీకటి ఏమాత్రమూలేని వెలుగు - 1యో 1,5. ఆ జ్యోతిర్మూర్తి కుమారుడు క్రీస్తు. కనుక క్రీస్తుకూడ సంపూర్ణ ప్రకాశమే.

7. తన వాక్ర్కియలద్వారా క్రీస్తు వెలుగు

నూత్నవేదం క్రీస్తు జ్యోతి అని మాటిమాటికి చెప్తుంది. అతడు ప్రపంచానికి వెలుగు - యోహా 9,5. జగత్తుకి జ్యోతి అతడే కనుక అతన్ని విశ్వసించేవాడు అంధకారంలో నడవక జీవపు వెలుగును పొందుతాడు - 8,12. క్రీస్తు గ్రుడ్డివారికి చూపును దయచేసిన అద్భుతాలు ఈ సత్యాన్ని మరింత ప్రస్ఫుటంగా వెల్లడి చేస్తాయి.

క్రీస్తు పలుకులు వెలుగు. అతడు లోకానికి వెలుగుగా విచ్చేసాడు. కనుక అతన్ని - విశ్వసించేవాడు చీకటల్లో నడువడు - యోహా 12,46. అతని చేతలు కూడ వెలుగే ప్రభువు వెల్లురుగా లోకంలోనికి వచ్చి ప్రతి మానవునికి వెలుగునిస్తుంటాడు - 1,9. అతనిలో చీకటి వెలుగులకు ఘర్షణం జరుగుతూంటుంది. సద్వర్తనలు ఆ వెలుగును సమీపిస్తారు. దుప్రియలు చేసేవాళ్ళు మాత్రం వెలుగుకంటే చీకటినే అధికంగా ఆశిస్తారు. వాళ్లు ప్రభువు శిష్యులుకారు, అతని దగ్గరికి రారు - 3,19. అలాంటివాళ్ళల్లో యూదా వొకడు. అతడు ద్రోహియైకూడ తోడి శిష్యులతో పాటు ప్రభువును రొట్టెరూపంలో స్వీకరించాడు. ఆ పిమ్మట గది నుండి వెలుపలికి వెళ్ళిపోయాడు. అది రాత్రివేళ -