పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతని సింహాసనం స్ఫటిక ఫలకంలా మెరిసిపోతూంటుంది - నిర్గ 24, 10. అతడు సీనాయి కొండమీద పొగల్లో సెగల్లో నిప్పమంటల్లో ఉరుముల్లో మెరుపుల్లో భూకంపంలో మోషేకు దర్శనమిచ్చాడు - నిర్గ 19,18. అనగా అతడు జ్యోతిర్మూర్తి, దీనికి భిన్నంగా పాతాళ లోకం అంధకార బంధురమైంది - కీర్త 88,6. ప్రకాశమూర్తియైన ప్రభువు పాతాళలోకంలోని వాళ్ళను చూస్తాడు గాని వాళ్ళు అతన్ని చూడలేరు.

3. వెలుగు జీవాన్నిస్తుంది

బైబుల్లో వెలుగుకి చాలా అర్ధాలున్నాయి. కాని అది ప్రధానంగా జీవానికి చిహ్నంగా వుంటుంది, "వెలుగు మనోజ్ఞమైంది. సూర్యని చూచి మన నేత్రాలు ఆనందిస్తాయి - ఉపదే 11,7. కనుక వెల్లరంటే చూడ్డం, ఆనందించడం, జీవించడం. గ్రుడ్డివాడు వెల్లరును చూడలేడు. కనుక అతని బ్రతుకు చావుతో సమానం. ఐతే చావుని బ్రెచ్చిపెట్టే రోగాన్ని తప్పించుకొని బ్రతికి బయటపడ్డవాడు మాత్రం మల్లా సజీవుల మీద ప్రకాశించే వెలుగులో నడుస్తాడు - కీర్త56, 13 అనగా అతడు జీవాన్ని పొందుతాడు. ఈ సందర్భంలో ఓ కీర్తనకారుడు భగవంతుణ్ణి ఉద్దేశించి

"నీవు జీవపు చెలమవు
నీ వెలుగువలననే మేమూ వెలుగు చూస్తాం”

అని వాకొన్నాడు – 86,9. ఇక్కడ మనం చూచే 'వెలుగు" ఆనందం, జీవం. ఈ జీవం మనకు దేవుని నుండే లభిస్తుంది.

బైబుల్లో వెలుగుకి చాల సాంకేతికార్ధాలున్నాయి. జ్యోతి అంటే జీవం, ఆనందం, రక్షణం, భగవంతుడు. అలాగే తమస్సు అంటే దుఃఖం, వినాశం, పాతాళలోకం, చావు, పిశాచం,

ప్రభువు తేజస్సు అతని ఉపకారగుణాన్ని సూచిస్తుంది. కనుకనే కీర్తనలు వ్రాసిన భక్తులు చాలమంది "ప్రభూ! నీ ముఖకాంతిని ఈ దాసుని మీద ప్రసరింపజేయి" అని ప్రార్థించారు - 31,16. మరో భక్తుడు

"ప్రభువు నాకు దీపం, నాకు రక్షణం
ఇక నేనెవరికీ భయపడ నక్కరలేదు"

అని నమ్మాడు – 27,1.

ప్రభువులాగే అతని వాక్కుకూడ తేజోవంతమైంది.
"నీ వాక్యం నా, పాదాలకు దీపం
నా త్రోవకు వెలుగు” - 119,105.