పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. భావోత్పత్తి

యావే కాపరిలాంటివాడు తాము గొర్రెల లాంటివాళ్ళు అనే భావం యిస్రాయేలు ప్రజల్లో ఏలా ఉద్భవించింది? యిప్రాయేలీయులకు సమీప ప్రజలైన ఈజిప్టు బాబిలోనియా ప్రజల్లో గూడ ఈ భావాలు ప్రచారంలో వుండేవి. ఈ దేశాల జనులు తమ రాజును కాపరిగా భావించేవాళ్లు, తమ్మ గొర్రెల మందనుగా ఎంచుకొనేవాళ్లు, ఈ భావాలే యిస్రాయేలు ప్రజల్లో గూడ ప్రవేశించి వుండవచ్చు.

ప్రాచీన హీబ్రూ ప్రజలు ఓ స్థిరనివాసమంటూ లేకుండా అటూ యిటూ తిరుగుతుండేవాళ్ళు గొర్రెలమందలను గూడ తమతో తోలుకొని పోతుండేవాళ్లు, హేబెలు గొర్రెలకాపరి - ఆది 4,2. "మా ముత్తాతల్లాగే మేముకూడ గొర్రెల కాపరులం" అంటారు ఫరోతో యోసేపు సోదరులు - ఆది 47,8. బహు ప్రాచీన కాలంలోనే హీబ్రూ ప్రజలు గొర్రెలను మచ్చిక చేసారు. గొర్రె అనే పదం బైబుల్లో 500 సార్లు తగులుతుంది. ఇంత ప్రచురంగా వాడబడిన ఈ ప్రాణి యిప్రాయేలీయుల సామాన్య జంతువుల్లో వొకటి.

గొర్రె వారికి సామాన్య జంతువు కావడానికి కారణాల్లేకపోలేదు. హీబ్రూ ప్రజలకు బహువిధాల ఉపయోగపడింది గొర్రె, వారు దాన్ని మాంసాన్ని భుజించేవాళ్లు, పాలు త్రాగేవాళ్లు ఉన్నిని బట్టలకు గుడారాలకు వాడుకొనేవాళ్ల వ్యాపారంలో గొర్రె మారకపు ధనంగా ఉపయోగపడేది. గుడారాల కాలంలో నైతేనేం దేవాలయ కాలంలో నైతేనేం గొర్రెలను బలిపశువుగా అర్పించారు. పైగా గొర్రె సాధుజంతువు. విశ్వాసంతోను స్నేహభావంతోను కల్లాకపటం లేకుండా కాపరివెంట నడచిపోతుంటుంది, కాపరి తన్ను కాపాడితేనే గాని బ్రతకలేని బలహీనపు జంతువు. ఇన్ని కారణాల చేత గొర్రె యిస్రాయేలు ప్రజలకు అనురాగయోగ్యమైన ప్రాణి ఐంది. కావున వాళ్లు తమ్ము గొర్రెలమందతో బోల్చుకొన్నారు. తమ దేవుడైన యావేను కాపరితో పోల్చారు. ఇక్కడ కాపరి అంటే నాయకుడు అని భావం.

3. యూదుల నాయకులూ కాపరులే

యూదుల చరిత్రను పరికించినట్లయితే మరో విషయం కూడ స్పష్టమౌతుంది. వీళ్ళ నాయకుల్లో చాలమంది కాపరులు. మోషే గొర్రెల కాపరి. "మోషే అహరోనుల ద్వారా నీ జనులను మందవలె నడిపించుకొని పోయావు" అంటుంది కీర్తన 77,20, దావీదురాజు తొలిరోజుల్లో కాపరే. కనుక ప్రభువు అతనితో "గొర్రెలను గాసుకొంటూ పొలాల్లో తిరుగాడుతూన్న నిన్ను బిలిపించి నా ప్రజలమీద అధిపతిగా నియమించాను"