పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/172

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

5.బొసువే అబ్రాహాము ఈసాకుని బలి యీయగోరినపుడు ఆ ఈసాకు రాబోయే క్రీస్తుబలినే సూచించాడు. యోసేపు అనుభవించిన శ్రమలు క్రీస్తు శ్రమలనే సూచిస్తాయి. సోదరులు యోసేపనిలాగే ప్రజలు క్రీస్తుని ద్వేషించారు, హింసించారు, చంపబోయారు. యోసేపునిలాగే అతన్ని కూడ బానిసనుగా అమ్మివేసారు. మృత్యువనే బావిలో పడడోసారు, బావిలోవున్నయిర్మియా, అగ్నిగుండంలో వున్న ముగ్గురు బాలకులు, సింహాల గుంటలో వున్నదానియేలు అతన్నేజ్ఞప్తికి దెస్తారు. ప్రతి బలిలోని బలిపశువు కూడ ఆ క్రీస్తునే సూచిస్తుంది. నోవా వోడనుండి బయటికి వచ్చాక అర్పించిన బలి అతన్నే సూచిస్తుంది. పితరులు కొండల విూద అర్పించిన బలులూ, మోషే గుడారంలో అర్పించిన బలులూ, యూదులు దేవళంలో అర్పించిన బలులూ అతన్నే జ్ఞప్తికి తెస్తాయి. ఈ విధంగా ఎల్లకాలాల్లోను సూచనమాత్రంగా బలియాతూవచ్చిన ప్రభువు, ఇప్పుడు యధార్థంగా బలికావడానికి విచ్చేసాడు." ఇవి లోతైన వాక్యాలు.

4. కాపరి

1. యావే ప్రభువు కాపరి

పూర్వవేదం యావే ప్రభువును కాపరితో ఉపమిస్తుంది. "ప్రభువే నాకు కాపరి,ఇక యే కొదవా లేదు" అంటాడు కీర్తనకారుడు - 23,1. బాబిలోనియాకు బందీలుగా వెళ్ళిన యూదులు యెరూషలేముకు తిరిగిరావడాన్ని గూర్చి చెప్తూ యెషయా ప్రవక్త

"ప్రభువు కాపరివలె తన మందను మేపుతాడు
గొర్రెపిల్లలను చేతులలోనికి దీసికొని
రొమ్ముమీద బెట్టుకొని మోసికొనిపోతాడు
వాని తల్లలను మెల్లగా అదలిస్తాడు"

అన్నాడు–40,11. ఈ ప్రవచనంలో ప్రభువు మృదు హృదయాన్నిరమ్యంగా చిత్రించాడు ప్రవక్త, యావే ప్రభువు కాపరియైతే అతడు మేపే గొర్రెలు యిస్రాయేలు ప్రజలు. కనుకనే “నీ ప్రజలమూ, నీ మందా ఐన మేము నీకు సదా కృతజ్ఞతలు తెల్పుకొంటాం" అన్నాడు భక్తుడు - కీర్త 79,13, కాపరి గొర్రెలను కాచి కాపాడతాడు. అలాగే యావే కూడ యిప్రాయేలు ప్రజలను ఆదరించి సంరక్షిస్తాడు.