పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నాడు –2సమూ 7,3. ప్రవక్తయైన ఆమోసు కాపరి -ఆమో 1:1. ఈ విషయాలనుబట్టి చూస్తే కాపరి-గొర్రె అనే భావం యిస్రాయేలీయులలో బాగా జీర్ణమైపోయినట్లు కన్పిస్తుంది. కాని యిూ జనులు ఈ భావాన్ని తమకూ తమ దేవునికీ అన్వయించుకోవడం చాల ధైర్యసాహసాలతో గూడిన విషయం. ఈ ప్రజలకు తమ భగవంతుని పట్లగల చనువు అంత గొప్పది అనాలి.

4. మెస్సీయా కాపరి

యావే ప్రతినిధి, యావే తరపున ప్రజలను పరిపాలించేవాడు మెస్సీయా, యావేతోపాటు ఈ మెస్సీయాను గూడ కాపరితో ఉపమించారు హీబ్రూ రచయితలు. యావే యెన్నుకొన్న రాజులు దుషులూ అవిశ్వాసపరులూఐ ప్రజలను పీడిస్తూ వచ్చారు. "తమ లాభాన్ని తామే చూచుకొనే యిస్రాయేలు కాపరులంటే నాకు పరమ అసహ్యం. కాపరి మంద బాగోగులను విచారించి చూడవద్దా" అంటాడు ప్రభువు - యెహెజ్కేలు 34,2. ఈ దుష్టరాజులతో విసిగిపోయి "ఇక వీళ్ళతో, నా కవసరం లేదు. నా మందను నేనే మేపుకొంటాను" అంటాడు ప్రభువు - 34,15.

హీబ్రూ రచయితలు ఈ సందర్భంలోనే వో క్రొత్త భావాన్ని ప్రవేశపెట్టారు. యావే తన ప్రతినిధియైన మెస్సీయాను తనకు బదులుగా మందకు కాపరినిగా నియమిస్తాడు. అతడు దావీదు ప్రభువును తలపించే క్రొత్త దావీదు ఔతాడు - యెహెజ్కేలు 34,23-24

5. గాయాలు తగిలిన కాపరి

చివరి ప్రవక్తల్లో వొకడు జెకర్యా అతని నాటికి మరో భావం ప్రచారంలోకి వచ్చింది. ఓగొప్ప కాపరి బయలుదేరాడు. అతనికి గాయాలు తగులుతాయి. శత్రువులు అతని వక్షస్సును వ్రయ్యలు చేస్తారు. అతడు సొంత ప్రాణాలొడ్డి మందను కాపాడతాడు. "వాళ్లు తాము కత్తితో పొడిచినవాని వైపు చూస్తారు. ఏకైక కుమారుని కోల్పోయినవారివలె అతని కొరకు విలపిస్తారు" - జెక 12,10.

ఈలా పూర్వవేదంలో కాపరిని గూర్చిన భావాలు కొండమీది సెలయేళ్ళలాగ బహుముఖాలుగా వెలుబడ్డాయి. ఈ భావాలన్నీ ఎవరియందు సార్ధకం గావాలి? ఈ జీవ వాహినులన్నీ ఏ సముద్రంలో సమ్మేళనం గావాలి?

6. క్రీస్తు కాపరి

పూర్వవేద ప్రవక్తలు సూచించిన కాపరి రానే వచ్చాడు, "బేల్లెహేమూ! యిప్రాయేలు పాలకుడు నీనుండే ఉద్భవిస్తాడు" అన్న మీకా ప్రవచనం ప్రకారం అతడు బేల్లెహేం