పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారి కోప తీసికొని వారిని బానిసంనుండి విడిపించాడు. కనుక ఇక్కడ మనకు ఇది ముఖ్యమైన భావం.

2. యావే విమోచకుడు

యావే ఐగుప్తలోని యిప్రాయేలీయులపట్ల విమోచకుడుగా మెలిగాడు. ఏలాగ? ఫరోయిస్రాయేలీయులను బానిసలనుగా ఏలుతూ ముప్పతిప్పలు పెడుతున్నాడు. వాళ్ళచేత వెట్టిచాకిరి చేయించి బ్రహ్మాండమైన భవనాలు కట్టిస్తున్నాడు. ఆ బాధలు భరించలేక వాళ్ళ ప్రభువుకి మొరపెట్టారు. ఆ మొర హేబెలు మొరలాగ ప్రభువు సన్నిధిని చేరింది. అతనికి ఆ ప్రజలమీద జాలివేసింది. తాను వాళ్ళకి దగ్గరి చుట్టమయ్యాడు. వారి s. తీసికొని వాళ్ళను రక్షింపగోరాడు. మోషేతో "నేనే ప్రభువుని. నేను ఐగుప్రీయులు మీ నెత్తికెక్కించిన బరువుని తొలగిస్తాను. వారి దాస్యం నుండి మీకు విముక్తి కలిగిస్తాను. శక్తిగల నా చేతిని చాచి మీ శత్రువులను నిశితంగా శిక్షిస్తాను. మిమ్మ దాస్యం నుండి విడిపిస్తాను" అన్నాడు — నిర్ధ 6,6.

మామూలుగా యిస్రాయేలు విమోచకులు బానిసలుగా అమ్ముడుబోయిన తమ బంధువులను విడిపించడానికి వాళ్ళ యజమానులకు సొమ్మ చెల్లించేవాళ్ళు So) యిస్రాయేలీయులను విడిపించడానికి యావే ఫరోకు సామ్మ ఏమాత్రం చెల్లించలేదు. ఫరోకు ధనమిచ్చికాదు, అతన్ని సర్వనాశం చేసి ప్రభువు యిస్రాయేలీయులను విడిపించుకొనివచ్చాడు. కనుకనే అతడు మోషేతో "ఫరో రాజనీ అతని రథాలనూ అశ్వాలనూ సైన్యాలనూ నాశంచేసి నా మహిమను ప్రదర్శిస్తాను" అని చెప్పాడు — నిర్ణ 14,18.

ఈ విమోచనంద్వారా యిస్రాయేలీయులు యావే భక్తులయ్యారు. వాళ్ళు ఐగుప్తనుండి బయలుదేరి రాగానే అతడు సీనాయి కొండదగ్గర వాళ్ళతో నిబంధనం చేసికొన్నాడు. దానితో వాళ్ళు అతనికి యాజకరూపమైన రాజ్యమూ, పవిత్ర ప్రజా, సొంత జనమూ అయ్యారు - నిర్ణ 19, 5-6. ప్రభువు వాళ్ళను ప్రేమతో ఎన్నుకొని తనవారిని చేసుకొన్నాడు. “అతడు స్వయంగా మిమ్మ ప్రేమించాడు కనుక, మీ పితరులతో తాను చేసికొనిన వాగ్దానాన్ని నిలబెట్టుకోగోరాడు కనుక, మిమ్మేయెన్నుకొన్నాడు. కావుననే ప్రభువు మహాబలంతో మిమ్ము తోడుకొని వచ్చాడు, ఐగుప్త రాజైన ఫరో దాస్యంనుండి మిమ్మ విడిపించాడు" - ద్వితీ 68. ఈవిధంగా ప్రభువు యిప్రాయేలీయులకు విమోచకుడయ్యాడు.

యూదులకు ఐగుప్త మొదటి ప్రవాసమైతే బాబిలోనియా రెండవ ప్రవాసం. కనుక ప్రవక్తలు ఈ విమోచనాన్ని బాబిలోనియా ప్రవాసానికిగూడ అన్వయింపజేసారు.