పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఐగుప్త విమోచనం క్రీస్తుపూర్వం 13వ శతాబ్దంలో జరిగింది. బాబిలోనియా విమోచనం క్రీస్తుపూర్వం 539లో జరిగింది. ఈ బాబిలోనియా విమోచనాన్ని గూర్చి యెషయా చాలా ప్రవచనాలు చెప్పాడు. ప్రభువు యిప్రాయేలీయులను తన దత్తపుత్రులను జేసికొంటాడు. వారికి దగ్గరిచుట్టమైవాళ్ళను విడిపిస్తాడు. “యిస్రాయేలూ! నీవు నాకు సేవకుడవు. నీవు భయపడకు. నేను నీకు తోడై యుంటాను. నీవు వెరవకు. నేను నీకు దేవుణ్ణి. నేను నీకు బలాన్నిచ్చి నిన్నాదుకొంటాను. నా శక్తితో నిన్ను రక్షిస్తాను - 41, 10.

యిర్మియా ఇంకా ఇతర ప్రవక్తలు ప్రభువు ప్రవచనాన్ని రాబోయే మెస్సియాకు గూడ వర్తింపజేసారు. అనగా ప్రభువు మెస్సియూద్వారా తన విమోచనాన్ని కొనసాగించుకొనిపోతాడు. ఈ సందర్భంలో యిర్మీయా ప్రవచనం "ఆ దినాలు కడచిన తర్వాత నేను నా యాజ్ఞలను ప్రజల హృదయాలమీదనే లిఖిస్తాను" అని చెప్తుంది - 31, 33–34. ఇది నూత్న నిబంధనాన్ని సూచించే వాక్యం. ఈ నూత్న నిబంధన కర్త క్రీస్తే కనుక ఇక ఆ ప్రభువు కొనివచ్చిన విమోచనాన్ని పరిశీలిద్దాం.

3. క్రీస్తు విమోచకుడు

యిర్మియాలాంటి ప్రవక్తల ప్రవచనాలు నెరవేరి యేసుప్రభువు రానేవచ్చాడు. యావే పూర్వవేద విమోచకుడైతే యేసు నూతవేద విమోచకుడు. కనుకనే అతడు "మనుష్య కుమారుడు సేవలు చేయించుకోడానికి రాలేదు. సేవలు చేయడానికే వచ్చాడు. అతడు అనేకుల రక్షణం కోసం తన ప్రాణాలను క్రయధనంగా వెచ్చిస్తాడు” అని చెప్పాడుమార్కు 10,45. ఈ "క్రయధనం" పూర్వవేదంలో బానిసను విడిపించడానికి చెల్లించే సొమ్ము నూత్నవేదంలో మనం పాపంద్వారా పిశాచానికి బానిసలమౌతాం. ఈ బానిసం నుండి మనలను విడిపించడానికి క్రీస్తు చెల్లించే సామ్మ అతని సొంత ప్రాణాలే. అతడు తన ప్రాణాలొడ్డి మనలను పిశాచదాస్యం నుండి విడిపించాడు. ఇదే నూత్నవేదవిమోచనం.

పూర్వవేద విమోచనానికీ నూత్నవేద విమోచనానికీ చాలా పోలికలున్నాయి. అక్కడ ప్రజలు ఫరోకు దాసులు, ఇక్కడ మనం పాపానికీ పిశాచానికీ దాసులం. యూదులు రెల్లసముద్రం దాటారు. మనం దాటే సముద్రం జ్ఞానస్నానం, ఆనాడు యావే ప్రభువు సీనాయికొండ దగ్గర యూదులతో నిబంధనం చేసికొన్నాడు. వాళ్ళ అతన్ని కొలిచే ప్రజలయ్యారు. ఈనాడు క్రీస్తు జ్ఞానస్నానం ద్వారా మనతో నిబంధనం చేసికొంటాడు. మనం ఇతన్ని కొలిచే ప్రజలమౌతాం. యూదులు వాద్దత్తభూమిలో ప్రవేశించారు. మనం చేరుకొనే వాగ్దత్తభూమి మోక్షమే. అక్కడ ప్రజలను నడిపించిన నాయకుడు మోషే నూతవేద ప్రజలను నడిపించే నాయకుడు క్రీస్తే, యావే ప్రభువు ఫరోకు డబ్బు చెల్లించి కాదు,