పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. రక్షకుడు 197

11. మెస్సీయా (క్రీస్తు) 200

12 యేసు 203

13. వరుడు - వధువు 207

14. ద్రాక్షలత 215

15. జీవమయుడు 222

16. గృహనిర్మాత 230

17. నిబంధనాకారుడు 234

- ప్రశ్నలు 242

1. విమోచకుడు

విమోచనం బైబుల్లో చాల పెద్ద భావం. ఇది ఐగుప్తన యూదుల బానిసంతో ప్రారంభమౌతుంది. పూర్వవేదమంతట కన్పిస్తుంది. నూత్నవేదంలోను గోచరిస్తుంది.

1. విమోచకుడు

విమోచకుడు అంటే ఆపదనుండి విడిపించేవాడు లేక రక్షించేవాడు అని అర్థం. హీబ్రూ ప్రజల సాంఘికజీవనంలో ఇతడు ఓ దగ్గరి చుట్టమైయుండి తన బంధువులకు మేలుచేస్తుంటాడు. హీబ్రూ భాషలో ఇతన్ని "గోయెల్" అనేవాళ్ళు

పూర్వవేదంలో విమోచకుడు మూడు పనులు చేసేవాడు.

1. యూదుల్లో ఎవరైనా పేదవాళ్ళయిపోయి తమ ఆస్తిని ఋణదాతలకు అమ్ముకొంటే వాళ్ళ దగ్గరి చుట్టమయిన విమోచకుడు మళ్ళా వాళ్ళకు ఆ యాస్తిని సంపాదించి పెట్టాలి. అనగా అతడు ఋణదాతనుండి ఆ పాలాన్ని కొని దాన్ని సొంతదారునికి ముట్టజెప్పాలి. "మీతోడి యిప్రాయేలీయుడు ఎవడైన పేదవాడై తన పొలాన్ని అమ్మకొంటే అతని దగ్గరి చుట్టం దాన్ని మళ్ళా కొనిపెట్టాలి - లేవీ 25,25.

2. ఏ యూదుజ్జయినా శత్రువులు చంపివేస్తే ఆ చంపబడినవాని దగ్గరి చుట్టం విమోచకుడుగా ప్రవర్తించి ఆ శత్రువులమీద పగతీర్చుకోవాలి. "హంతను చంపే బాధ్యత హతుడైనవాని దగ్గరి బంధువులది. అతడు కంటపడగానే వారతన్నిచంపివేయాలి" - లేవీ 35,19, .

3. ఆలాగే యూదుల్లో ఎవడైనా పేదవాడై బానిసగా అమ్ముడుబోతే అతని దగ్గరి చుట్టయిన విమోచకుడు అతన్ని ఆ బానిసం నుండి విడిపించాలి — లేవీ 25, 47-49. యావే ప్రభువు ఈ మూడవ అర్థంలో యిప్రాయేలీయులకు విమోచకుడయ్యాడు. ఐగపులో