పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/159

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తొలి మూడు సువిశేషాల్లో క్రీస్త సిలువపై ఒంటరిగా మరణిస్తాడు. కాని యోహాను గ్రంథంతో సిలువ క్రింద మరియ ప్రియశిష్యుడు నిల్చివుంటారు. క్రీస్తు శిష్యులందరికీ మరియను తల్లిని చేసాడు. శిష్యులందరినీ మరియు బిడ్డలను చేసాడు. సిలువ క్రిందనే యోహాను మరియలతో కూడిన భక్త సమాజం ఏర్పడుతుంది. ఇదే ఆదిమ క్రైస్తవ సమాజం.

చనిపోకముందు క్రీస్తు దేవా నన్నేల చేయి విడచావు అనడు. అంతా సమాప్తమైంది అంటాడు. అనగా తండ్రి నిర్ణయించిన రక్షణ ప్రణాళిక అతని ద్వారా పూర్తయిందని భావం, క్రీస్తు మరణం జీవనదాయకం. ఆయన మరణం నుండి జీవజల ప్రవాహాలు పట్టి భక్తుల హృదయాల్లోకి పారతాయి.

క్రీస్తు మృతదేహానికి వందపౌన్ల సుగంధ ద్రవ్యం పూసి నారబట్టలు చుట్టి క్రొత్త సమాధిలో పాతిపెట్టారు. అనగా అతన్ని రాజమర్యాదలతో పాతిపెట్టారు. అతడు రాజాధిరాజు,

సంగ్రహంగా చెప్పాలంటే, మత్తయి మార్ములు వర్ణించిన క్రీస్తు ప్రజల నిరాదరణకు గురై చనిపోతాడు. కడన తండ్రివలన విజయాన్ని పొందుతాడు. లూకా చిత్రించిన క్రీస్తు ఇతరులపై కరుణ చూపేవాడు. యోహాను చిత్రించిన క్రీస్తు రీవితో సిలువ సింహాసన మెక్కి రాజ్యపాలనం చేసే ప్రభువు.

తపస్సు కాలంలో ప్రమానికొమ్మల ఆదివారం నాడు క్రమంగా మొదటి సంవత్సరం మత్తయి, రెండవ సంవత్సరం మార్కు మూడవ సంవత్సరం లూకా వ్రాసిన శ్రమల చరిత్రను చదువుతాం. పెద్ద శుక్రవారం నాడు ప్రతి యేట యోహాను వ్రాసిన శ్రమల చరిత్రను చదువుతాం.