పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/160

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

3. దివ్యనామావళి

మనవిమాట

ఈ పుస్తకాన్ని పూర్వమే "బైబులుభాష్యం" 79,80, 84-86 సంచికల్లో ప్రచురించాం. వాటినే ఇప్పడు ఏకగ్రంథంగా అందిస్తున్నాం.

దివ్యనామావళి అంటే క్రీస్తు బిరుదాలు. నూత్నవేదం పేర్కొనే క్రీస్తు బిరుదాలు చాలా వున్నాయి. వాటన్నిటి మీదా వాఖ్య చెపే పుస్తకం అంతులేకుండా పెరిగిపోతుంది. కనుక ఇక్కడ ముఖ్యమైన బిరుదాలను పదిహేడింటిని మాత్రం ఎన్నుకొని వాటిమీద విపులమైన వివరణం చెప్పాం, పూర్వ నూత్నవేదాలనుండి ఈ బిరుదాలకు సంబంధించిన అంశాలను ఓ క్రమపద్ధతిలో వివరించాం.

క్రీస్తు బిరుదాలు ఆ ప్రభువు గుణగణాలనూ, అతని మరడోత్థానాలనూ, అతడు నేడు మనకు ప్రసాదించే రక్షణనూ వివరిస్తాయి. వీటిద్వారా మనం క్రీస్తుని అధికంగా అర్థంచేసికొని అతనిపట్ల భక్తిని పెంపొందించుకోవచ్చు.

అన్ని మతాల్లోను భగవంతుని దివ్యనామాలను కీర్తించడం అనే సంప్రదాయం వుంది. హిందూమతంలో "విష్ణ సహస్రనామావళి" మొదలైనవి వున్నాయి. క్రైస్తవులమైన మనం కూడ క్రీస్తు పవిత్రనామాలను క్షుణ్ణంగా అర్థంచేసికొని, భక్తితో మననం చేసికోవాలి. ఈ కార్యసాధనకు ఈ పుస్తకం కొంతవరకైనా తోడ్పడుతుందని ఆశిస్తున్నాం. ఇది మూడవ ముద్రణం.

విషయసూచిక

1. విమోచకుడు 152
2. మధ్యవర్తి 156
3. గొర్రెపిల్ల 160
4. కాపరి 163
5. జగజ్యోతి 168
6. జీవాహరం 174
7. నేనే మార్గాన్ని 181
8. నూత్న ఆదాము 189
9. శిల 193