పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శతాధిపతి ఇతడు నిజంగా దేవుని కుమారుడేనని సాక్ష్యం పలుకుతాడు. క్లుప్తంగా చెప్పాలంటే, చనిపోయిన పిదపనే గాని అతని గొప్పతనం, మంచితనం విదితం కావు.

ఇక లూకా పద్ధతి యిది. శిష్యులు మంచివాళ్లే గెశ్చిమని తోపులో నిద్రపోయినా శోకభారంతో నిద్రించారు. వాళ్ళ నిద్రించింది మూడుసార్లు కాదు, ఒక్కసారే. యేసు శత్రుల విూద కూడ లూక అంతగా తప్పమోపడు. వాళ్ళ యేసుపై తప్పడు సాక్ష్యాలు చెప్పించరు. నాకు క్రీస్తులో ఏ లోపం కన్పించలేదని పిలాతు మూడుసార్లు చెప్తాడు. లూకా పిలాతుని గూడ దుష్టునిగా చిత్రించడు. యూదుల దేవాలయమన్నాధర్మశాస్త్రమన్నా లూకాకు పరమ గౌరవం. యేసు తన కష్టాలు మర్చిపోయి ఇతరుల బాధల్లో సానుభూతి చూపిస్తాడు. ఓలివు తోటలో పేత్రు శత్రువు చెవిని నరకగా క్రీస్తు దాన్ని మళ్లీ అంటిస్తాడు. తనకొరకు విలపించే పుణ్యస్త్రీలతో మి బిడ్డల కొరకు ఏడ్వండని చెప్తాడు. క్రీస్తు అపారమైన కరుణ కలవాడు. కనుకనే తనతో పాటు సిలువపై వ్రేలాడే దొంగకు పాప క్షమాపణనూ మోక్షప్రాప్తి దయచేస్తాడు. వీళ్లేమి చేస్తున్నారో వీళ్ళకే తెలియదు. కనుక శత్రువులను క్షమించమని తండ్రిని వేడుకొంటాడు. కడన తండ్రీ నీ చేతుల్లోకి నా ప్రాణాలను అర్పించుకొంటున్నాను అని పలికి ప్రశాంతంగా కన్నుమూసాడు.

కడన, యోహాను పద్దతి యిది. క్రీస్తు తీవికల రాజు. అతని ప్రాణంపై అతనికొక్కనికే అధికారం వుంది, అతడే దాన్ని ధారపోస్తాడు. మల్లా స్వీకరిస్తాడు కూడ. కనుక అతని జీవనమరణాలకు అతడే కర్త - 10,18, ఓలివు తోటలో క్రీస్తుని బంధించడానికి వచ్చిన రోమను సైనికులు అతనికి భయపడి నేలకొరిగారు. తొలి మూడు సువిశేషాల్లో లాగ ఇక్కడ క్రీస్తు తండ్రీ! ఈ గడియను తొలగించు అని ప్రార్థించడు. దాని కొరకు ఉత్సాహంతో ఎదురుచూస్తుంటాడు - 12,27. తండ్రి తనకిచ్చిన పాత్రను త్రాగగోరుతాడు - 18, 11. సిలువ మరణం అతనికి అవమానాన్ని గాక మహిమను తెచ్చిపెడుతుంది. ప్రధానార్చకుడు క్రీస్తు బోధను గూర్చి ప్రశ్నింపగా రీవితో నా బోధలు విన్నవారిని అడిగి తెలుసుకొమ్మంటాడు. తనకు తీర్పు చెప్పే పిలాతుతో నామిూద నీకు ఏ యధికారం లేదని ధైర్యంగా చెప్తాడు.

యోహాను గ్రంథంలో కురేనియ సీమోను కన్పింపడు, యేసు తన సిలువను తానే మోసికోని పోతాడు. యోహాను భావాల ప్రకారం అతడు రాజు రాజని మూడు భాషల్లో శాసనం వ్రాసి సిలువపై పెట్టారు. యేసు మహారాజుగా సిలువ సింహాసనం ఎక్కాడు. అతనికి ఇరువైపుల ఇద్దరు దొంగలు పరివారంగా ఉన్నారు.