పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చినపుడు పాస్క గొర్రెపిల్లను భుజించి వచ్చారు. ఆ గొర్రెపిల్ల ఎముకలను విరగగొట్టకూడదని ప్రభువు మోషేను ఆజ్ఞాపించాడు - ద్వితీ 12,46. ఈ ప్రవచనం ఇప్పడు క్రీస్తు పట్ల నెరవేరింది. అతడు మన పాస్క గొర్రెపిల్ల కదా! ఇంకా, కీర్తన 34.20 ఈలా చెప్పంది :

ప్రభువు అతన్ని సురక్షితంగా కాచికాపాడతాడు
అతని యెముక ఒక్కటి కూడ విరుగదు.

ఈ కీర్తన ఓ నీతిమంతుని గూర్చి చెప్తుంది. ప్రభువు నీతిమంతుని భద్రంగా కాపాడతాడని వాకొంటుంది. ఈ వాక్యం కూడ క్రీస్తుకి అన్వయిస్తుంది. అతడు మహా నీతిమంతుడు. కనుక తండ్రి అతన్ని భద్రంగా సంరక్షిస్తాడు. అతని యెముకను ఒక్కదాన్ని కూడ విరుగనీయడు.

సైనికులు క్రీస్తు కాళ్ళను విరగగొట్టకుండా వదలివేసారు. కాని వాళ్లు క్రీస్తు నిజంగా చనిపోయాడని నిర్ధారణ చేసికోగోరారు. కనుక ఒక సైనికుడు అతని ప్రక్కను ఈటెతో పొడిచాడు. వెంటనే ఆ గాయం నుండి నెత్తురూ నీళ్ళూ స్రవించాయి. ఇది భౌతికంగా జరిగిన సంఘటనం. క్రీస్తు మృతదేహం నుండి ఈ రెండు ద్రవాలు వెలువడ్డంలో ఆశ్చర్యమేమిూ లేదు. కాని యోహాను ఇక్కడ ఈ రెండు సంఘటనల్లోను లోతైన భావాలను చూచాడు. ఆ భావాలను మనం కూడ జాగ్రత్తగా గమనించాలి.

క్రీస్తు ప్రక్కనుండి నీరు స్రవించింది. దీని భావమేమిటి? యోహాను గ్రంథంలో నీరు పవిత్రాత్మకు చిహ్నంగా వుంటుంది. ప్రభువే ఈలా నుడివాడు : "దప్పికగొన్నవాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవచ్చు. నన్ను విశ్వసించేవాని అంతరంగం నుండి జీవజల నదులు పారతాయి. క్రీస్తు తన్ను విశ్వసించేవాళ్లు పొందబోయే ఆత్మను గూర్చి ఈ జీవజల నదులు అన్నమాట వాడాడు” - 7,37-39. కనుక ఇక్కడ జీవజలనదులు క్రీస్తు హృదయంలో పుట్టి భక్తుల హృదయాల్లోకి పారతాయి. అనగా పవిత్రాత్మ క్రీస్తు నుండి బయలుదేరి భక్తుల హృదయాల్లోకి దిగివస్తుంది. కనుక ఇక్కడ క్రీస్తు ప్రక్కలోనుండి కారిన నీళ్లు పవిత్రాత్మను సూచిస్తాయి. ఇంకా ఈ నీళ్లు జ్ఞానస్నానాన్ని వరప్రసాదాన్ని కూడ తెలియజేస్తాయి. ప్రభువు నుండి మనము వీటన్నిటిని పొందుతాం.

ఇక క్రీస్తు ప్రక్కలో నుండి నెత్తురు కూడ కారింది. దీని భావమేమిటి? ఈ నెత్తురు సత్ర్పసాదానికి చిహ్నం. యోహాను 6,53-56లో ప్రభువు మనం తన శరీరాన్ని భుజించి తన రక్తాన్ని పానం చేయాలని కోరాడు, అప్పుడే గాని మనలో జీవముండదని వాకొన్నాడు. ప్రభువు శరీరరక్తాలు అతని మరణానికి గుర్తుగా వుంటాయి. దివ్యసత్ర్పసాద రూపంలో మనకు ఆహారమౌతాయి. క్రీస్తు మనకొరకు బలియైన పాస్క గొర్రెపిల్ల కదా!