పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వం యూదులు పాస్క గొర్రెపిల్లను లాగ ఇప్పడు మనం క్రీస్తుని భుజిస్తాం. ఇక పై వాక్యాలు పేర్కొనే క్రీస్తు రక్తం మనకు ఆహారమైనట్లే అతని ప్రక్కలో నుండి కారిన రక్తం కూడ మనకు ఆహారమౌతుంది. ఆ రక్తం ఈ రక్తం ఒకటే కదా! కనుక క్రీస్తు ప్రక్కలోనుండి కారిన నెత్తురు దివ్యసత్రసాదానికి చిహ్నంగా వుంటుంది.

ఈ సందర్భంలో ప్రాచీన వేదశాస్తులు ఇంకో సంగతి కూడ చెప్పారు. యావే ప్రభువు నిద్రపోతున్న తొలి ఆదాము ప్రక్కటెముకను తీసి దానినుండి తొలి ఏవను రూపొందించాడు. అలాగే ఇప్పడు సిలువ మిూద నిద్రపోయే మలి ఆదాము ప్రక్కలో నుండి కూడ రెండవ ఏవ పుట్టింది. ఆమే మన తల్లియైన తిరుసభ.

పురాతన క్రైస్తవులు క్రీస్తు ప్రక్కలోని గాయం పట్ల విశేష భక్తిని చూపారు. అది అన్ని దేవద్రవ్యానుమానాలకూ అన్ని వరప్రసాదాలకూ నిలయం. మనం కూడ క్రీస్తు గాయం పట్ల, క్రీస్తు హృదయం పట్ల అపార భక్తిని చూపాలి. క్రీస్తు హృదయం నుండే నీరూ నెత్తురూ కారి గాయం గుండా వెలుపలికి వచ్చాయి.

క్రీస్తు మరణంలో రెండు ప్రవచనాలు నెరవేరాయి. మొదటిది, అతని యెముకలు విరగకపోవడం. దీన్ని గూర్చి విూదచూచాం. ఇక రెండవది, "వాళ్లు తాము పొడిచినవాని వంక వీక్షిస్తారు" అనే ప్రవచనం, ఇది జకర్యాప్రవచనం 12,10లో వస్తుంది. మూలంలో రాజు ప్రవక్త ఐన ఓ మహానుభావుణ్ణి కొందరు దుపులు వధిస్తారు. యెరూషలేము పౌరులు సానుభూతితో సంతాపంతో అతని వైపు చూస్తారు. యోహాను ఈ ప్రవచనాన్ని క్రీస్తుకి అన్వయింపజేసాడు. క్రీస్తు ప్రక్కను పొడిచింది రోమను సైనికులు ప్రధాన యాజకులు మొదలైన శత్రుజనమంతా కూడ. అతని వైపు సంతాపంతో చూచేది ప్రియశిష్యులు పుణ్యస్త్రీలు మొదలైన వాళ్ళంతా కూడ. అలా పొడవబడిన క్రీస్తు వైపు చూచి వీళ్లు రక్షణం పొందుతారు. నేడు మనం కూడ సిలువ వేయబడిన ప్రభువవైపు చూచి రక్షణం పొందాలి. మోషే యెడారిలో సర్పాన్ని ఎత్తినట్లుగా మనుష్యకుమారుని కూడ సిలువమిూద ఎత్తుతారు. అతన్ని చూచి విశ్వసించే ప్రతివాడు నిత్యజీవం పొందుతాడు - 13,14-15. ఇంకా క్రీస్తుని భూమి విూది నుండి పైకెత్తినపుడు అతడు అందరినీ తనవైపు ఆకర్షించుకొంటాడు - 12,37. ఈలా ఆకర్షింపబడిన వారిలో మనం కూడ వుంటే ఎంత ధన్యంగా వుంటుంది.

క్రీస్తు ప్రక్కలో నుండి నీళ్ళూ నెత్తురూ కారాయనీ అవి పవిత్రాత్మనూ దివ్యసత్ర్పసాధాన్ని సూచిస్తాయనీ యోహాను సాక్ష్యం పలుకుతున్నాడు. ఆ సాక్ష్యం నిజమైంది. నాడు యోహాను చుట్ట ప్రోగైన భక్త సమాజం కూడ ఈ సాక్ష్యాన్ని నమ్మింది. నేడు మనం కూడ ఈ సాక్ష్యాన్ని విశ్వసించి రక్షణం పొందాలి - 19,35. క్రీస్తు నుండి లభించే దేవద్రవ్యానుమానాలూ వరప్రసాదాలు పవిత్రాత్మ తిరుసభ మనకు రక్షణ సాధనాలు.