పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సువిశేషాల్లోను భావం ఒక్కటే. క్రీస్తు తండ్రి తన కొప్పజెప్పిన పనిని ముగించి విజయనాదం చేస్తూ ప్రశాంతంగా మరణించాడు.

క్రీస్తు తలవంచి ప్రాణం విడిచాడు - 19.30. కాని యిక్కడ గ్రీకు మూలంలో వున్న వాక్యాన్ని "తలవంచి ఆత్మను విడిచాడు" అని ఆంద్రీకరించాలి. ఈ వాక్యానికి రెండు విధాలుగా అర్ధం చెప్పవచ్చు. మొదటిది, క్రీస్తు తలవంచి తన ఆత్మను తండ్రిచేతుల్లోకి అప్పగించాడు అని చెప్పవచ్చు. రెండవది, అతడు తలవంచి తన పవిత్రాత్మను శిష్యుల మిూదికి వదిలాడు అని కూడ చెప్పవచ్చు. క్రీస్తు మరణానంతరం అతని ఆత్మ శిష్యుల విూదికి దిగివస్తుంది. ఆయన తన్ను విశ్వసించేవాళ్లు పొందబోయే ఆత్మను గూర్చి జీవజల నదులు అనే మాట పల్మాడు. యేసు ఇంకా మహిమను పొందనందున ఆత్మ ఇంకా అనుగ్రహింపబడలేదు - 7,39,

5. నెత్తురు నీరు స్రవించడం - 19,31-37

తొలి మూడు సువిశేషాలు క్రీస్తు మరణించినపుడు చీకట్ల క్రమ్మాయనీ, భూమి కంపించిందనీ, దేవాలయం లోని తెర చినిగిందనీ చెస్తాయి. యోహాను సువిశేషం ఈ సంగతులేమి ప్రస్తావించలేదు. వీటికి బదులుగా నాల్గవ సువిశేషం మృత క్రీస్తు ప్రక్కను బల్లెంతో పొడిచారనీ ఆ పోటుకి నెత్తురూ నీళ్ళూ కారాయనీ చెప్తుంది. ఈ సంఘటనను ఇక్కడ కొంచెం విపులంగా పరిశీలిద్దాం.

క్రీస్తు శుక్రవారం సాయంత్రం చనిపోయాడు. ఆ మరుసటి దినమైన శనివారం పాస్కపండుగ, విశ్రాంతి దినం కూడ. కనుక అది గొప్ప పర్వదినం, అలాంటి ఉత్సవ దినాన యోరూషలేము దరిదాపుల్లో శవాలు సిలువపై వ్రేలాడుతుండకూడదు. పైగా ద్వితీయోపదేశ కాండం 21, 23 సిలువ వేసిన నరుడ్డి ఆ దినమే పూడ్చిపెట్టాలని ఆజ్ఞాపిస్తుంది. కనుక యూదనాయకులు సిలువ మిూద ప్రేలాడే ముగ్గురిని కాళ్ళు విరగగొట్టి త్వరగా చనిపోయేలాచేసి శీఘంగా పాతిపెట్టాలని నిశ్చయించుకొన్నారు. పిలాతు అనుమతిపై రోమను సైనికులు వెళ్ళి దొంగ కాళ్లు విరుగగొట్టారు. కాళ్ళకు ఆధారం లేదు కనుక వాళ్ల సిలువ విూద ప్రేలాడుతూ గాలి పీల్చుకోలేక త్వరగా చనిపోయారు.

కాని ఆ సైనికులు క్రీస్తు దగ్గరికి వచ్చి చూడగా అతడు అప్పటికే చనిపోయి వున్నాడు. కనుక వాళ్లు క్రీస్తు కాళ్లు విరగగొట్ట నక్కరలేదు అనుకొని అతన్ని అలాగే వదలివేసారు. ఈలా సైనికులు దొంగల కాళ్ళను విరగగొట్టి క్రీస్తు కాళ్ళను ముట్టుకోకపోవడమనేది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనం కాదు. ఇక్కడ పూర్వవేద ప్రవచనం నెరవేరింది. పూర్వం యూదులు ఈజిప్టు నుండి బయలుదేరి