పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/145

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దుష్టుణ్ణి ఎన్నుకొని నీతిమంతుణ్ణి నిరాకరించారు. లోకంపోకడ ఈలా వుంటుంది. బరబ్బను గూర్చిన వివరాలేవీ మనకు తెలియవు. బరబ్బకు రావలసిన శిక్ష క్రీస్తుకి వచ్చింది. అతని కోసం ఇతడు సిలువ మిూద చనిపోవలసి వచ్చింది.

4. క్రీస్తుని కొరడాలతో కొట్టి గేలిచేయడం - 19,1-3

ఈ కార్యం భవనం లోపల జరిగింది. పిలాతు క్రీస్తుని కొరడాలతో కొట్టించాడు. కొరడాదెబ్బలకు గురైన క్రీస్తుని చూచినప్పడు యూదులకు జాలీ సానుభూతీ కలుగుతాయి. ఆపిమ్మట అతన్ని విడుదల చేయవచ్చు అనుకొన్నాడు పిలాతు. కాని అలా యేమి జరుగలేదు. క్రీస్తు తాను రాజునని చెప్పకొన్నందున సైనికులు ఇక్కడ క్రీస్తుని ఎగతాళి చేసారు. ఆ ప్రభువుకి ముళ్ళకిరీటం పెట్టడం, ఊదావస్త్రం తొడగడం, అతనికి నమస్కారం చేయడం ఇవన్నీ క్రీస్తు రాచరికాన్ని ఎగతాళి చేయడానికే, ఈ దుష్టులు ప్రభువు రాజత్వాన్ని అంగీకరించక పోయినా అతడు మాత్రం నిజమైన రాజే. క్రీస్తు ఉత్థానానంతరం అన్యజాతి ప్రజలు అతనికి శిష్యులై అతన్ని రాజునిగా అంగీకరిస్తారు.

5. పిలాతు క్రీస్తుని ప్రజలకు చూపించడం - 19,4-8

ఈ సంఘటనం భవనం వెలుపల జరిగింది, పిలాతు రెండవసారి క్రీస్తు నిర్దోషి అని ప్రకటించాడు. క్రీస్తుని వెలుపలికి తీసుకొనివచ్చి ప్రజలకు చూపించాడు. ప్రభువు ముళ్ళకిరీటం ధరించి ఊదా రంగు అంగీ తొడుగుకొని రక్తసిక్తమైన దేహంతో ప్రజల యెదుట నిలబడ్డాడు. అతన్ని చూచి ప్రజలు జాలిచెందుతారు అనుకొన్నాడు పిలాతు.

అతడు క్రీస్తుని ప్రజలకు చూపుతూ "ఇదిగో ఈ నరుడు" అని పల్మాడు. ఇక్కడ "ఈ నరుడు" అన్నమాట ముఖ్యం. ఈ మాటను వాడ్డంలో పిలాతు భావం ఇది, కొరడాలతో కొట్టబడిన ఈ జనుడు దీనుడు, దుర్బలుడు. ఇతడు రాజకీయ నాయకుడు కాదు. ఇతని వల్ల రోమను సామ్రాజ్యానికి ఏ ముప్పూ వాటిల్లదు. కనుక ఇతన్ని వదలివేయడం న్యాయం.

"ఇదిగో ఈ నరుడు" అన్న పిలాతు మాటలు శతాబ్దాల పొడుగున ఎందరో భక్తులకు ప్రేరణం పట్టించాయి. కొరడాదెబ్బలకు దేహం నజ్ఞనజ్ఞ కాగా వేదనాభరితుడై యున్న ప్రభువుని ఎందరో నరులు భక్తిభావంతో ధ్యానం చేసికొన్నారు. ఎందరో చిత్రకారులు ఈ ఘట్టాన్ని చిత్రాలుగా గీసారు.

కాని పిలాతు భావం వేరు యూదుల భావాలు వేరు. వాళ్లు ఈ క్రీస్తు తాను దేవుని కుమారుజ్ఞని చెప్పకొంటూన్నాడు. అది దేవదూషణం. కనుక ఇతన్ని సిలువ వేయాలని బిగ్గరగా అరిచారు. దేవదూషణకు శిక్ష మరణం. లేవీ 24, 15-16. ఇక్కడ యూదులు మోపిన నేరం రాజకీయమైంది కాదు, మతపరమైంది.