పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంకా, నీవేమి చేసావు అని పిలాతు క్రీస్తుని అడిగాడు. ప్రభువు దుష్టకార్యాలేమి చేయలేదు. అతడు చేసిన వన్నీ మంచిపనులే.

పిలాతు నీవు రాజువా అని రెండవ పర్యాయం అడిగాడు. క్రీస్తు నీవు అన్నట్లు నేను రాజునే. కాని నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నేను ఇహలోక రాజుని కాదు. సత్యానికి సాక్ష్యమియడానికి వచ్చిన రాజుని అని చెప్పాడు. ఇక్కడ "సత్యం" అంటే తండ్రి నిర్ణయించిన రక్షణ ప్రణాళికను నెరవేర్చడం. అనగా సిలువమరణం ద్వారా నరుల పాపాలకు పరిహారం చేయడం, అసలు క్రీస్తే రక్షణమూ సత్యమూ కూడ.

క్రీస్తు వెలుగు, యూదనాయకులు చీకటిలో వుండేవాళ్లు. కనుక వాళ్ల క్రీస్తుని నిరాకరించి చంపగోరారు.

క్రీస్తు నేను సత్యానికి సాక్ష్యమిూయడానికి వచ్చానని చెప్పగానే పిలాతు సత్యమంటే యేమిటి అని అడిగాడు. కాని అతడు నిరాదరణ భావంతో ఈ ప్రశ్న అడిగాడు. సత్యమంటే యేమిటో తెలిసికోవాలన్న కోరిక అతనికి లేదు. అసలు ఆధ్యాత్మిక విషయాల విూద అతనికి ప్రీతి లేదు.

ప్రభువు నేను సత్యానికి సాక్ష్యమిచ్చేవాణ్ణి, సత్య సంబంధులు నా మాట వింటారు అన్నాడు. కనుక ఇప్పడు ప్రశ్న క్రీస్తు దోషా లేక నిర్దోషా అన్నది కాదు. పిలాతు సత్యాన్ని అంగీకరిస్తాడా లేదా అన్నది ప్రశ్న ఇక్కడ పిలాతు క్రీస్తుకి తీర్పు తీరుస్తున్నాడు. కాని యథార్థంగా జరిగిందేమిటంటే, క్రీస్తే పిలాతుకి తీర్పు తీరుస్తున్నాడు. నీవు సత్యాన్ని అంగీకరిస్తున్నావా లేక నిరాకరిస్తున్నావా అని అడుగుతున్నాడు. పిలాతు మళ్ళీ వెలుపలకివచ్చి జనంతో మాట్లాడాడు.

3. పిలాతు క్రీస్తు నిర్లోషి అని చెప్పడం - 18,38–40

ఈ సంఘటనం భవనానికి వెలుపల జరిగింది. పిలాతు క్రీస్తుని ప్రశ్నించినపుడు అతనిలో ఏ దోషం కన్పించలేదు. కనుక అతడు క్రీస్తు నిర్దోషి అని ప్రజలందరి యెదుట ప్రకటించాడు. ఇక్కడ అన్యజాతి వాడొకడు క్రీస్తు నిర్దోషి అని ప్రకటిస్తుంటే స్వజాతి వాళ్లు అతని దోషి అని చెప్పడం విడ్డురం.

పిలాతుకి ఓ ఆలోచన తట్టింది. పాస్కపండుగ సందర్భాన రాష్ట్ర పాలకుడు యూదులకు ఓ బందీని విడుదల చేయడం అలవాటు. ఈ నెపంతో నైనా క్రీస్తుని విడిపించవచ్చు కదా అనుకొన్నాడు పిలాతు. కాని యూదులు బరబ్బాను విడిపించి యేసుని సిలువ వేయమని అరిచారు. ఈ బరబ్బ బందిపోటు దొంగ. బహుశః రోమిూయుల విూద విప్లవం లేవదీసేవాడు కూడా. క్రీస్తు నిర్దోషి, నీతిమంతుడు. ఐనా దుష్టులైన ప్రజలు