పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యూదుల అరప్పలకు పిలాతు మరీ అదనంగా భయపడ్డాడు. ఈ ప్రజలు రోములోని కైజరు చక్రవర్తికి తన మిూద ఫిర్యాదు చేయవచ్చు. అప్పడు తన ఉద్యోగం ఊడిపోతుంది. కనుక అతడు క్రీస్తుని వదలిపెట్టడానికి వెనుదీసాడు.

6. నీవు ఎక్కడినుండి వచ్చావు? - 19,9-12

ఈ సంఘటనం మందిరం లోపల జరిగింది. పిలాతు క్రీస్తుని నీవెక్కడనుండి వచ్చావు అని ప్రశ్నించాడు. క్రీస్తు తాను మనుష్యకుమారుణ్ణీనీ దేవుని కుమారుద్ధానీ చెప్పకొన్నాడు గదా! ఇతడు తాను చెప్పినట్లుగా దేవుని కుమారుడేనేమో అని పిలాతుకి భయం వేసింది. పిలాతు ప్రశ్నకు జవాబు చెప్పకుండా క్రీస్తు మౌనంగా ఉండిపోయాడు,

క్రీస్తు మౌనం వహించిన సందర్భాలు చాలా ఉన్నాయి, అతడు ప్రధాన యాజకుని ముందు మౌనంగా ఉండిపోయాడు - మత్త 26,63. హేరోదు ఎదుట మాటలాడలేదు - లూకా 23,9, యూదనాయకులు పిలాతు నెదుట తన విూద నేరాలు మోపినపుడు ఏమిూ సమాధానం చెప్పలేదు - మత్త 27, 14. పిలాతు నీవు ఎక్కడినుండి వచ్చావు అని అడిగినపుడు ఏమిూ జవాబు చెప్పలేదు - యోహా 19,9. దుష్టులైన అధికారులు తన్ను ప్రశ్నించినపుడు ప్రభువు మామూలుగా మౌనంగా వహిస్తాడు. కాని ప్రభువు ఎవరిపట్ల మౌనంగా ఉండిపోతాడో అతనికి అనర్ధం. అతడు మన సమస్యలకూ సందేహాలకూ బాధలకూ జవాబు చెప్పకపోతే ఇక మనలను ఓదార్చే నాధుడెవరు?

క్రీస్తు మౌనం వహించడం చూచి పిలాతు నీవు నాతో మాటలాడవా? నీ ప్రాణం మిూదా మరణం విూదా కూడ నాకు అధికారముందని నీకు తెలియదా అన్నాడు, కాని క్రీస్తు నీకు నా పైన ఉన్న అధికారం పరలోకంలోని తండ్రివద్ద నుండి వచ్చింది సుమా అన్నాడు. తండ్రే క్రీస్తుని ఈ లోకంలోకి పంపాడు. అతనికి రక్షణ ప్రణాళికను ఒప్పజెప్పాడు, క్రీస్తు సిలువ మరణం ద్వారా ఆ ప్రణాళికను నెరవేర్చబోతున్నాడు. కనుక అధికారం తండ్రిదే. తండ్రి నిర్ణయించిన రక్షణ ప్రణాళిక వల్లనే క్రీస్తు పిలాతు చేతుల్లోకి వచ్చాడు. తండ్రే పిలాతు ద్వారా తన రక్షణ ప్రణాళికను నెరవేర్చుకొని పోతున్నాడు. క్రీస్తు మరణం యాదృచ్ఛికమైంది కాదు. తండ్రి ముందుగానే నిర్ణయించింది.

క్రీస్తుని పిలాతుకి అప్పగించినవాడు ఇంకా ఎక్కువ పాపము మూట గట్టుకొంటాడు. క్రీస్తుని అప్పగించింది ఒక యూదాయే కాదు, యూద నాయకులంతా కూడ పిలాతుకి తెలియక క్రీస్తుకి మరణశిక్ష విధించి వుండవచ్చు. కాని యూదనాయకులు తెలిసే, బుద్ధిపూర్వకంగానే ప్రభువుని మరణానికి అప్పగించారు.