పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. క్రీస్తుని పిలాతుకి అప్పగించడం - 18-28–32

యూద నాయకులు ఉదయాన్నే ప్రభువుని కయిఫా యింటి నుండి పిలాతు మందిరానికి తీసికొని వచ్చారు. యూదులు పిలాతు మందిరంలోనికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. వాళ్లు అన్యజాతీవాళ్ళ దగ్గరికి వెళ్లే అంటుపడతామనీ పాస్కవిందును యోగ్యంగా భుజించలేమనీ భావించారు. కాని పాస్క గొర్రెపిల్లమైన క్రీస్తుని అన్యాయంగా చంపడానికి మాత్రం ఏవిూ సంకోచించలేదు.

కనుక పిలాతు మందిరం నుండే బయటికి వచ్చి బయటనే యూదనాయకులను కలసికొన్నాడు. కావున ఈ సంఘటనం మందిరం వెలుపల జరిగింది.

పిలాతుకీ యూదులకు మధ్య జరిగిన సంభాషణ ఒకరిమిూద ఒకరు తప్పలు పడుతూ విరుచుకొని పడినట్లుగా వుంటుంది. ఇతని నేరమేమిటి అని పిలాతు ప్రశ్న ఏ నేరం లేకపోతే ఇతన్ని నీ దగ్గరికి ఎందుకు తీసుకొనివస్తాం అని యూదుల జవాబు. విూ చట్ట ప్రకారం విూరే ఇతనికి తీర్పు చెప్పండి అని పిలాతు ఆజ్ఞ. ద్రోహికి మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు నీకే వుంది అని యూదుల ప్రత్యుత్తరం.

నేరం చేసినవాళ్ళకు యూదుల శిక్ష రాళ్ళతో కొట్టిగ చంపడం, రోమనుల శిక్ష సిలువ మరణం, కనుక రోమనుల చట్టప్రకారం ఇతన్ని సిలువవేయించమని పిలాతుని కోరారు యూదులు, ప్రభువు విరోధులు తనకు సిలువ మరణం విధిస్తారని ముందుగానే చెప్పాడు – 12,32, ప్రభువు శ్రమల్లోని సంఘటనలన్నీ అతడు ముందుగా చెప్పినట్లే నెరవేరాయి.

2. పిలాతు క్రీస్తుని ప్రశ్నించడం - 17,83-88

ఈ సంఘటనం పిలాతు మందిరం లోపల జరిగింది. పిలాతు తన మందిరంలోపల క్రీస్తుతో ఏకాంతంగా మాటలాడాడు. క్రీస్తు మిూద వచ్చిన పెద్ద నేరం అతడు రాజునని చెప్పుకోవడం. యూదుల్లో ఒకడు రాజైతే పాలస్తీనా దేశం రోమను సామ్రాజ్యం విూద తిరగబడుతుంది. అప్పడు పెద్ద ముప్పు వస్తుంది. కనుక పిలాతు క్రీస్తుని నీవు రాజువా అని ప్రశ్నించాడు.

క్రీస్తు నేను రాజునే. కాని ఈ లోకసంబంధమైన రాజుని కాదు. నా రాజ్యం పరలోకానికి చెందింది అని చెప్పాడు. ఈ లోకపు రాజులు దురాశ, అధర్మం, హింస, కుట్ర, మొదలైనవాటికి పాల్పడతారు. పరలోకరాజ్యం ధర్మం, సత్యం, శాంతి, ప్రేమ మొదలైన విలువలకు నిలయం.క్రీస్తు ఆధ్యాత్మిక విలువల కొరకు వచ్చాడు కాని లౌకిక విలువల కొరకు రాలేదు.