పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ నాయకులు సమాధికి సైనికులను కాపలా వుంచమని పిలాతుని వేడుకొన్నారు. దానికి ముద్రవేసి కట్టుదిట్టం చేయమని అడిగారు. లేకపోతే క్రీస్తు శిష్యులు వచ్చి గురువు శరీరాన్ని ఎత్తుకొనిపోయి అతడు జీవంతో లేచాడని పుకార్లు పుట్టిస్తారని చెప్పకొన్నారు. క్రీస్తు జీవితకాలమంతా తాను మెస్సీయానని చెప్పి ప్రజలను మోసగించాడు. ఇప్పడు ఈ ఉత్తాన మోసం ఆ మొదటి మోసం కంటే ఇంకా గొప్పదౌతుందని విన్నవించుకొన్నారు.

కాని పిలాతు వారితో కటువుగా మాట్లాడాడు. వాళ్లు అసూయతో క్రీస్తుని పట్టియిచ్చారని అతనికి బాగా తెలుసు - 27, 18. కనుక అతడు వారితో విూకు రోమను సైనికులెందుకు? విూ దేవాలయ భటులు ఉన్నారు కదా! వారితో ఆ సమాధికి కాపలా కాయించుకోండి అని చెప్పాడు. వాళ్లు అలాగే దేవాలయ భటులను పంపి సమాధికి కాపలా పెట్టించారు. సమాధిపై ముద్రవేసి దాన్ని కట్టుదిట్టం చేయించారు. దానియేలు కథలో కూడ ఈ ముద్ర సంఘటనం వస్తుంది. దానియేలుని పడవేసిన సింహాలగుంట కన్నాన్ని బండతో పూడ్చి ఆ బండపై రాజముద్ర వేసారు — దాని 6,17.

ప్రభువు జీవితకాలంలోలాగే మరణానంతరం గూడ అతన్ని పురస్కరించుకొని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఓవైపు అరితమయియ యోసేపు, పుణ్యస్త్రిలు, యోహాను మొదలైనవాళ్లు అతని మిత్రులు. మరోవైపు ప్రధానార్చకులు, పరిసయులు మొదలైన యూదనాయకులు అతని శత్రువులు.

యూదనాయకులు ప్రభువు జీవితకాలంలో కంటే అతడు చనిపోయిన తర్వాత అతనికెక్కువగా భయపడ్డారు. వాళ్లు క్రీస్తుని సమాధిలో బంధించి వుంచుదామనుకొన్నారు. కాని వుత్దాన క్రీస్తుని సమాధిలో కట్టివుంచడం ఎవరితరం? దేవుడే క్రీస్తుకి ఉత్తానాన్ని దయచేసాడు. దానిద్వారా తన కుమారుడైన మెస్సీయా నీతిమంతుడని రుజువు చేసాడు. దేవుడు సంకల్పించుకున్న కార్యానికి ఎవరు అడురాగలరు? ప్రభువు ఆదివారం వేకువజామున బంధాలన్నీ బ్రెంచుకొని, సమాధిని బ్రద్దలు చేసికొని ఉత్థానమయ్యాడు. ఆ ఉత్దాన ప్రభువే నేడు మనకు జీవమిచ్చేది.

8. యోహాను వర్ణించిన క్రీస్తు శ్రమలు

1. పిలాతు తీర్పు - 18-28-19,16

యోహాను సువిశేషం పిలాతు తీర్చుని సవిస్తరంగా వర్ణిస్తుంది. ఈ తీర్పులో క్రీస్తు రాజు అనే భావం స్పష్టంగా కన్పిస్తుంది. ఈ తీర్పుని ఏడు భాగాలుగా విభజింపవచ్చు;